Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ..సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి UPSC CAPF 2024 : ఢిల్లీ(Delhi) లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ..సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ , సశస్త్ర సీమా బల్ లో 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తైన యువతీయువకులు ఈ పోస్టులకు ఆన్ లైన్ లో అప్లై(Apply Online) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులకు చివరి తేదీ , తదితర వివరాలను వెబ్సైట్ లో చూడొచ్చు. మొత్తం ఖాళీలు: 506 బీఎస్ఎఫ్- 186 సీఆర్పీఎఫ్- 120 సీఐఎస్ఎఫ్- 100 ఐటీబీపీ- 58 ఎస్ఎస్బీ- 42 ఇతర సమాచారం : అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయో పరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ముఖ్యమైన తేదీలు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మే 14, 2024 దరఖాస్తు సవరణ తేదీలు: మే 15 నుంచి 21 వరకు. రాత పరీక్ష తేదీ: ఆగస్టు 4, 2024. Also read: సరిహద్దులు దాటిన మానవత్వం…పాక్ యువతికి భారతీయుని గుండె! #govt-jobs #notification #upsc-capf-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి