Free Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు ఓయూలో ఫ్రీ కోచింగ్.. అప్లికేషన్ లింక్ ఇదే

ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు నెలలపాటు సివిల్స్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అసక్తి ఉన్నవారు డిసెంబర్ 2 వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది.

New Update
Free Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు ఓయూలో ఫ్రీ కోచింగ్.. అప్లికేషన్ లింక్ ఇదే

Free Civils Coaching in OU: సివిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్న అభ్యర్థులకు ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సీటీ (Osmania University) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. దేశంలోనే అత్యున్నత హోదా కలిగిన సివిల్స్ ఉద్యోగం కోసం కష్టపడుతున్న విద్యావంతులకు తనవంతూ చేయూతనిచ్చేందుకు ముందడుగు వేసింది. ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ ల్లో లక్షల్లో ఫీజులు కడుతూ అపసోపాలు పడుతున్న యువతకు ఊరట కలిగించడంతోపాటు మరింత నాణ్యమైన సబ్జెక్ట్ అందించేందుకు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగు నెలలపాటు సివిల్స్ శిక్షణను (Civils Coaching) పూర్తి ఉచితంగా అందిచబోతున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనే ఆసక్తిగల క్యాండెట్స్ నుంచి ధరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో పీహెచ్ డీ స్టూడెంట్స్, క్యాంపస్ కాలేజీలకు అవకాశం ఇచ్చింది. సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీ, నిజాం కాలేజీల్లో డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ MA, M.com, M.sc చదివే విర్థులతోపాటు MTech, MBA, LLM వంటి ఇతర పీజీ కోర్సులు చదివే వారికి కూడా అవకాశం కల్పించింది. ఈ సివిల్ సర్వీస్ అకాడమీలో 100 సీట్లు ఉన్నట్లు అధికారికంగా తెలిపిన డైరెక్టర్ డాక్టర్ కొంగ నాగేశ్వరరావు.. ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా డిసెంబర్ 2 వరకూ అప్లై చేసుకోవాలని తెలిపారు.

Also read :నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో SBIలో 8773 జాబ్స్.. నేటినుంచే ధరఖాస్తులు

అలాగే ఇందులో సీటు సాధించిన అభ్యర్థులకు మే 1 వరకూ ట్రైనింగ్ ఇవ్వనుండగా ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రెన్స్ లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రిజర్వేషన్ ప్రతిపాదికన అభ్యర్థులను సెలెక్ట్ చేస్తామని, పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ గొప్ప అవకాశం గ్రూప్1,2 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడనుంది. ఓయూ కల్పిస్తున్న ఈ అవకాశంపై నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ :
1. కాలేజీ ప్రిన్సిపాల్ జారీ చేసిన 2023-2024 విద్యా సంవత్సరం బోనాఫైడ్ సర్టిఫికేట్
2. SSC మార్కుల మెమో
3. డిగ్రీ మార్కుల మెమో
4. ఆధార్ కార్డ్
5. కుల ధృవీకరణ పత్రం
6. ఆదాయ ధృవీకరణ పత్రం
7. మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
8.PG ప్రవేశ పరీక్ష ర్యాంక్ కార్డ్

గమనిక:
ఆసక్తిగల విద్యార్థులు 2023 డిసెంబర్ 2 వరకూ ఓయూలోని సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో దరఖాస్తు ఫారమ్‌ను నేరుగా అందజేయవచ్చు.

Download Application Form

Advertisment
తాజా కథనాలు