AP: తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టులో కనిపించని అభివృద్ధి..!

గడచిన ఐదేళ్లలో విజయనగరం జిల్లాలోని తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు అభివృద్ధి కుంటుపడింది. కుడి ఎడమ కాలువలు, చిట్టచివర ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. ప్రాజెక్టు వద్ద భద్రత లేకపోవడంతో కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

AP: తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టులో కనిపించని అభివృద్ధి..!
New Update

Vizianagaram: శ్రీకాకుళం - విజయనగరం రెండు ఉమ్మడి జిల్లాలో రైతుల - ప్రజల దాహాన్ని తీరుస్తుంది కల్పవల్లి నాగావళి నది. లక్షల ఎకరాల్లో సాగునీరు అందించాలన్న ధ్యేయంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని తోటపల్లి బ్యారేజ్ (సర్దార్ గౌతు లచ్చన్న జలాశయం) నిర్మించారు. అయితే, ఈ ప్రాజెక్టు గడచిన ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడింది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కూడికలు తీసివేతలు ఇంతవరకు చెయ్యలేదు.

Also Read: ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి..!

కుడి, ఎడమ కాలువలు, చిట్టచివర ప్రాంతాలకు సాగునీరు అందాలంటే కష్టతరంగా మారింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వద్ద భద్రత లేకపోవడంతో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని స్థానిక గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

#thotapalli-barrage-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి