ధంతేరాస్ పండుగ శుక్రవారం మధ్యాహ్నం 12: 35 మొదలైంది. ధంతేరాస్ రోజున ప్రదోష కాలంలో పూజలు నిర్వహిస్తారు. ధంతేరాస్ శనివారం నాడు కూడా ఉంది. శనివారం త్రయోదశి కావడంతో దానిని శని త్రయోదశిగా పరిగణిస్తారు. రెండు తిథులు ఒకే రోజు రావడం మంచిదే అని పండితులు చెబుతున్నారు.
ఏలినాటి శని,అర్జాష్టమ శని, అష్టమ శని, జాతకంలో శని దోషాలు ఉన్నవారికి, శని మహర్దశ, శని అంతర్దశ వల్ల శని ప్రభావానికి ఇబ్బందులు పడిన వారికి శని త్రయోదశి చాలా విశేషమైన రోజుని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శనివారం నాడు నవగ్రహ ఆలయాలను దర్శించి శనికి తైలాభిషేకం వంటివి చేసుకుని శనికి సంబంధించిన శాంతులు దానాలు చేస్తే శనిగ్రహానికి సంబంధించిన పీడలు, ఈతి బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ధన త్రయోదశి కూడా ఉండడం చేత నవగ్రహ ఆలయాలను దర్శించి శనిని ఆరాధించడం వలన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటున్నారు పండితులు. ఆలయ దర్శనం అనంతరం ఇంట్లో కానీ, ఆలయాల్లో కానీ లక్ష్మీ దేవిని పూజించి దీపారాధన వంటివి చేసినట్లయితే..మరీ ముఖ్య విశేషంగా ప్రదోష కాలంలో సాయంత్ర సమయంలో ధన త్రయోదశి తిథి ఉన్నటువంటి సమయంలో లక్ష్మీ పూజలు ఆచరించినట్లయితే వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుందుని పండితులు తెలియజేస్తున్నారు.
ఈ ధన త్రయోదశి నాడు చీపురును కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకుని వచ్చినట్లే అని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చీపురులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే చాలా మంది దీపావళి నాడు చీపురుని తీసుకుని వచ్చి పూజించి ఆ మరుసటి రోజు నుంచి చీపురును ఉపయోగిస్తారు. అయితే చీపురు కొనేటప్పుడు కూడా వారం వర్జ్యం వంటివి చూస్తుండాలి.
ముఖ్యం గా శనివారం నాడు చీపురును అసలు కొనకూడదు. పగటి సమయంలో చీపుర్లను కొనకూడదు. సాయంత్రం వేళలోనే చీపుర్లను కొనాలి. ఇంట్లో వాడిన చీపురును బయట వాడకూడదు. అలాగే చీపురును ఎప్పుడూ కూడా ఉత్తర దిశలోనే ఉంచాలి. దేవుడి గదిలో కానీ..పడక గదిలో కానీ ఉంచకూడదు.
ధన త్రయోదశి రోజున ఏదైనా దేవాలయానికి చీపురును దానంగా ఇస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు. చీపురును కాళ్లతో తాకడం కానీ, ఎవర్ని కొట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. దీపావళి రోజున చీపురుని కొని పువ్వులు, అక్షింతలతో పూజించాలి.
Also read: ధన్‌తేరాస్ రోజున పొరపాటున కూడా వీటిని కొనుగోలు చేయకండి…!!