జీర్ణశయం అల్సర్ వచ్చిన సందర్భాల్లో బాగా మంటతో కూడిన నొప్పి, అన్నం తింటూనే ఎక్కువై 3,4 గంటల తర్వాత తగ్గుతుంది. అన్నం సహించకపోవడం, ఆకలి మందగించడం, వాంతులు అవడం, బరువు తగ్గడం, వాంతి అయిన సందర్భాల్లో కడుపులో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.డ్యుయోడినల్ అల్సర్స్ కనిపించినప్పుడు కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నొప్పి అధికమవుతుంది. అన్నం తిన్న 2,3 గంటలు దాటిన తర్వాత.. అర్ధరాత్రి, తెల్లవారు జామున ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది.
అయితే ఈ వ్యాధి కచ్చితంగా ఎందుకు వస్తుందో వైద్యులు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. అయితే, ఈ వ్యాధి జన్యు పరంగా లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావం, జీవనశైలిలో మార్పులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ల కారణంగా వస్తుందని వైద్యులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చిన వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ.. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ కచ్చితమైన డైట్ పాటించాలి. పలు సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే అల్సరేటివ్ కొలైటిస్ నుంచి బయట పడవచ్చు.
టీ, కాఫీ, ఆల్కహాల్‌లకు బదులుగా గ్రీన్ టీ లేదా తులసి టీ తాగితే అల్సరేటివ్ కొలైటిస్ నుంచి బయట పడవచ్చు. అలాగే పొగతాగడం, పొగాకు నమలడం కూడా మానేయాలి. లేదంటే వ్యాధి మరింత తీవ్రతరమవుతుంది. ఇక కారం, మసాలాలు దట్టించిన ఆహారాలను తీసుకోవడం మానేయాలి. పుల్లని పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోరాదు. ఇవి జీర్ణమయ్యేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది.
కారంతో చేసిన కూరలు కాకుండా.. ఉడకబెట్టిన కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర, బీరకాయ, ఆనపకాయ తదితర కూరగాయలను ఉడికించి తినాలి. ఇక ముల్లంగి, కీరదోస, పుచ్చకాయ, చింతపండు తినడం మానేయాలి. అలాగే పచ్చి కూరగాయలు కూడా తినకూడదు.
చేపలు, మటన్ కాకుండా కోడిగుడ్లు, సోయా, పల్లీలు తదితర ఆహారాలను తీసుకోవాలి.అలాగే పాలు, పెరుగు, చీజ్, స్వీట్లు తదితర ఆహారాలను పూర్తిగా మానేయాలి లేదా తినడం తగ్గించాలి. పాలను కచ్చితంగా తాగాలనుకునేవారు అందుకు బదులుగా బాదంపాలు, సోయా పాలు, సోయా చీజ్, మేక పాలు, కొబ్బరి పాలు తాగవచ్చు.