Telangana Bonalu : ఈరోజే భవిష్యవాణి.. రాష్ట్రమంతా ఉత్కంఠ!

లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి చేస్తోంది. రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీ పై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర సోమవారం సాయంత్రం ముగియనున్నాయి. జోగినీ చెప్పే భవిష్యవాణి పై భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

New Update
Telangana: ఎవ్వరు అడ్డం పడ్డా..నా విగ్రహం పెట్టించుకుంటా -మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

Secunderabad : లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. 200 ఎఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణ (Telangana) లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహంకాళి అమ్మవారి బోనాల (Mahankali Bonalu) ఉత్సవాలు ప్రశాంతంగా సాగాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రభుత్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో అమ్మవారి బోనాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

లక్షలాది మంది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణతో మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోతు రాజుల ఆటపాటలతో ఫలహారం బండి ఊరేగుంపులతో సోమవారం తెల్లవారు జామున తొలి రోజు బోనాల సంబరాలు ముగిసాయి. మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ రెండో రోజు కొనసాగుతుంది. వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

రంగం భవిష్యవాణి (Rangam Bhavishyavani), ఏనుగు అంబారీ పై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర సోమవారం సాయంత్రం ముగియనుంది. జోగినీ చెప్పే భవిష్యవాణి పై భక్తుల ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల తరువాత రంగం భవిష్యవాణి ఉండనుంది.

Also read: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు