Nalgonda Suicide: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆకతాయిల వేధింపులకు ఇద్దరు యువతులు బలయ్యారు. యువతుల వాట్సాప్ డీపీలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు దుండగులు. మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతుల ఆత్మహత్య చేసుకున్నారు. మనీషా, శివాని అనే ఇద్దరు యువతులు నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. అయితే.. సోషల్ మీడియాలో తమ ఫోటోలు మార్ఫింగ్ పెట్టారని మనస్థాపానికి గురైన ఇద్దరు స్టూడెంట్స్ నల్గొండ రాజీవ్ పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరణించారు.
Also Read: హైదరాబాద్‌లో విషాదం.. నాలాలోపడి చిన్నారి మృతి
డీపీ మార్ఫింగ్‌తో మనస్తాపం:
మెంటల్‌గా టార్చర్ చేయడం ఈ మధ్య కాలంలో చాలా మందికి ఫ్యాషన్‌గా మారిపోయింది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో యువతలను టార్గెట్ చేసుకోని వారిని మానసికంగా హింసించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నల్గొండ ఘటనలోనూ అదే జరిగింది. మనీషా, శివానిని టార్గెట్ చేసుకోని వారి పొటోలను మార్ఫింగ్ చేశారు. మెసేజీల్లో బ్లాక్‌మెయిల్ మొదలుపెట్టారు. లిమిట్ దాటి ప్రవర్తించారు.
చనిపోయిన విద్యార్థులు నార్కట్ పల్లి మండంలోని నివాసముంటారు. మనిషా, శివాని ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చిన్నతనం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. వాట్సాప్ డీపీలుగా తమ ఫొటోలను ఇద్దరూ పెట్టుకున్నారు. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేశారు. అశ్లీలంగా మార్చి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది తెలిసిన స్టూడెంట్స్ ఇద్దరూ పార్క్‌కి వెళ్లి ఆత్మహత్యయత్నం చేశారు. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. చికిత్స పొందుతూ వారిద్దరూ ఇవాళ మృతి చెందారు. ఈ ఘటన నల్గొండలో విషాదాన్ని నింపింది. విద్యార్థినుల మృతికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని మృతుల పేరేంట్స్ కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని… డేటాను పరిశీలించే పనిలో పడ్డారు. బ్లాక్‌మెయిల్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ALSO READ: బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రూ.50 వేల జరిమానా