TS News: వ్యవసాయ బావి తవ్వుతుండగా ఇద్దరు వ్యక్తులో మట్టిలో చిక్కుకుపోయారు. నరకయాతన అనుభవించి మృత్యువు అంచుకు వరకు వెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు గంటల శ్రమించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే:
కేసముద్రం మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతు తాను సాగు చేసే పొలంలో బావి తవ్వకం ప్రారంభించాడు. బావి తవ్వుతుండగా అడుగున ఓ రాయి తగిలింది. దానిని పరిశీలించేందుకు కూలీ నరేశ్ తోపాటు సుధాకర్ బావిలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు బావిలో దిగినివారిపై మట్టికూలింది. దీంతో పీకల్లోతు వరకు మట్టిలో చిక్కుకుని నరకయాతన అనుభవించారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీల సహాయంతో సుమారు రెండు గంటలపాటు శ్రమించి రైతును, కూలీలిద్దరిని సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీశారు. సుధాకర్, సురేశ్ లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వ్యవసాయ బావిలో చిక్కుకున్న ఇద్దర్నీ కాపాడిన పోలీసులను అక్కడున్నవారంతా అభినందించారు.
ఇది కూడా చదవండి : ఉగాది నుంచి ఈ ఐదు రాశుల వారికి పట్టుకుందల్లా బంగారమే..!