Crime News: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరు అరెస్ట్

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. వీరేంద్రనాథ్, కొమ్ము ప్రవీణ్ అనే ఏజెంట్లను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Crime News: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరు అరెస్ట్
New Update

Vishaka:  విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటారు. ఐటీ ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తారు. ఇలా ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను కాంబోడియాకు అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Also Read: టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మృతి.!

తాజాగా, విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. వీరేంద్రనాథ్, కొమ్ము ప్రవీణ్ అనే ఏజెంట్లను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిసెంట్ గా ఆందోళ‌న వ్యక్తం చేస్తూ ట్విట్ కూడా చేశారు.

#vishaka #human-trafficking
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe