Crime News: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరు అరెస్ట్ విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. వీరేంద్రనాథ్, కొమ్ము ప్రవీణ్ అనే ఏజెంట్లను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 27 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Vishaka: విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటారు. ఐటీ ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తారు. ఇలా ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను కాంబోడియాకు అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు. Also Read: టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మృతి.! తాజాగా, విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. వీరేంద్రనాథ్, కొమ్ము ప్రవీణ్ అనే ఏజెంట్లను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిసెంట్ గా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్ కూడా చేశారు. It's deeply concerning and appalling that Andhra Pradesh has turned into a human trafficking hub. In a racket operating between India and Cambodia, over 150 Telugu youngsters were trafficked on the pretext of jobs and forced into cybercrime. I demand stringent action against fake… — N Chandrababu Naidu (@ncbn) May 24, 2024 #human-trafficking #vishaka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి