Mukesh Ambani: అంబానీని బెదిరించిన వ్యక్తుల అరెస్ట్.. నిందితులు వీరిద్దరే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని డబ్బుల కోసం బెదిరించిన ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన గణేష్ రమేష్, గుజరాత్ కు చెందిన షాదాబ్ ఖాన్ లను అరెస్ట్ చేశారు.

New Update
Mukesh Ambani : భారత సంపన్నుడు మళ్లీ ముకేశుడే...!

Mukesh Ambani Threat Case: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని(Mukesh Ambani) బెదిరించిన నిందితులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ నుంచి ఓ వ్యక్తి, గుజరాత్ నుంచి మరో వ్యక్తి ముఖేష్ అంబానీని బెదిరించినట్లు గుర్తించిన ముంబై పోలీసులు.. శనివారం నాడు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ముఖేష్ అంబానీకి గుర్తు తెలియని వ్యక్తుల షాదాబ్ ఖాన్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ మెయిల్స్ పంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ మెయిల్స్ పంపింది తెలంగాణ, గుజరాత్ నుంచి వచ్చినట్లు గుర్తించిన ముంబై పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

తొలిసారి మెయిల్ పంపినప్పుడు రూ. 20 కోట్లు డిమాండ్ చేశాడు నిందితుడు. లేదంటే తన వద్ద ఉన్న షార్ప్ షూటర్స్‌ను రంగంలోకి దించాల్సి వస్తుందంటూ బెదిరించాడు. ఈ మెయిల్‌పై ముఖేష్ అంబానీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే మరో మెయిల్ పంపిన నిందితుడు అప్పుడు రూ. 200 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ తరువాత మరో మెయిల్ పెట్టి రూ. 400 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ముంబై పోలీసులు.. తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి అనే 19 సంవత్సరాల యువకుడు ఈ మెయిల్స్ పంపినట్లు నిర్ధారించారు. అలాగే గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్ (21) పంపినట్లు గుర్తించారు. శనివారం నాడు వీరిద్దరినీ అరెస్ట్ చేసి ముంబై కి తీసుకెళ్లారు. వీరిపై IPC సెక్షన్లు 387, 506(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

Also Read:

పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!

నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు