భారీగా పెరగనున్న టీవీ ఛానల్స్ సబ్‌స్ర్కిప్షన్ ధరలు!

టీవీ ఛానల్స్ సబ్‌స్ర్కిప్షన్ ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి.దీంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా యూజర్ల సబ్‌స్ర్కిప్షన్ల ధరలను అమాంతం పెంచే అవకాశం ఉంది. దాంతో సామాన్యులపై మరింత భారం పడనుంది.

భారీగా పెరగనున్న టీవీ ఛానల్స్ సబ్‌స్ర్కిప్షన్ ధరలు!
New Update

జీ ఎంటర్‌టైన్‌మెంట్, డిస్నీ స్టార్, సోనీ పిక్చర్ నెట్‌వర్క్ ఇండియా బ్రాడ్‌క్యాస్టర్లు తమ ఛానల్ లిస్టును మరింత పెంచే అవకాశం లేకపోలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం టీవీ ఛానల్స్ ధరలు పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే, ఎన్నికలు ముగిశాయి. రాబోయే కొద్దిరోజుల్లో ఛానల్స్ సబ్‌స్ర్కిప్షన్ ధరలు పెరగనున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

టీవీ ఛానల్ సబ్‌స్క్రిప్షన్ రేట్లు 5శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం టీవీ వీక్షించేందుకు నెలవారీ టీవీ సబ్‌స్క్రిప్షన్‌పై రూ. 500 చెల్లిస్తే సరిపోయేది. ఇకపై టీవీ సబ్‌స్క్రిప్షన్ రేటు రూ.40 వరకు పెరగవచ్చు. మీ టీవీ సబ్‌స్క్రిప్షన్‌పై ప్రతి నెలా రూ. వెయ్యి ఖర్చు చేయాల్సి వస్తుంది. తద్వారా దాదాపు రూ. 80 వరకు పెరుగుతుందని చెప్పవచ్చు.

సార్వత్రిక ఎన్నికల వరకు కొత్త టారిఫ్ ప్రకారం.. ఈ డీల్‌పై సైన్ చేయని డిస్ట్రిబ్యూటర్ ప్లాట్‌ఫాం ఆపరేటర్ల (DPOs) సిగ్నల్‌లను స్విచ్ ఆఫ్ చేయొద్దని ట్రాయ్ బ్రాడ్‌క్యాస్టర్లకు సూచించింది.గత జనవరిలో ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ బేస్ బొకే రేట్లను దాదాపు 10 శాతంగా పెంచింది. వయాకమ్18 గరిష్టంగా 25 శాతం పెంపు ఉంటుంది. రూ.500 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.125 వరకు పెరగనుంది. ఎంటర్ టైన్మెంట్, క్రికెట్ ఛానల్స్ మార్కెట్ వాటా దాదాపు 25 శాతంగా ఉంది.

#tv-channels-subscription
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe