TS Politics: సొంత గూటికి తుల ఉమ.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

బీజేపీతో దాదాపు రెండేళ్ల ప్రయాణం తర్వాత సొంత గూటికి చేరారు తుల ఉమ. వేములవాడ టికెట్ ను ఇవ్వకపోవడంతో బీజేపీకి రాజీనామా చేసిన ఆమె ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

New Update
TS Politics: సొంత గూటికి తుల ఉమ.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

ఈ రోజు బీజేపీకి (BJP) రాజీనామా చేసిన తుల ఉమ.. సొంత గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తుల ఉమకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల రాజేందర్ తో (Etala Rajender) కలిసి బీఆర్ఎస్ పార్టీని (BRS Party) వీడి బీజేపీలో చేరిన తుల ఉమ.. వేములవాడ నుంచి టికెట్ ఆశించారు. అయితే.. కొన్ని నెలల క్రితమే కాషాయ కుండువా కప్పుకున్న వికాస్ రావు నుంచి ఆమెకు తీవ్ర పోటీ ఎదురైంది. వికాస్ రావుకు బండి సంజయ్ తో పాటు పార్టీ పెద్దల నుంచి సపోర్ట్ ఉందన్న ప్రచారం సాగింది. అయితే.. ఈటల పట్టుబట్టి మరీ తుల ఉమకు టికెట్ ఇప్పించారు.
ఇది కూడా చదవండి: Tummala Vs Puvvada: పువ్వాడ నామినేషన్ చెల్లదు.. రిటర్నింగ్ ఆఫీసుకు తుమ్మల సంచలన ఫిర్యాదు

అయితే.. నామినేషన్ల ఆఖరి రోజున వేములవాడ టికెట్ ను మార్చుతున్నట్లు బీజేపీ ప్రకటన విడుదల చేసింది. వికాస్ రావును తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఆయనకు బీఫామ్ అందించింది. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు తుల ఉమ. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. అయితే.. కేటీఆర్ గత రెండు రోజుల క్రితమే తుల ఉమకు ఫోన్ చేసినట్లు సమాచారం.

కేటీఆర్ ఆహ్వానంతో తిరిగి సొంత గూటికి చేరాలని తుల ఉమ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తుల ఉమ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ గా పని చేశారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, నిజామాబాద్ జిల్లా ఇన్ ఛార్జిగా పని చేశారు.

Advertisment
తాజా కథనాలు