Vaikunta Dwara Darshan Tickets : తిరుమల(Tirumala) వచ్చే భక్తులకు అలర్ట్.. శుక్రవారం తిరుపతిలో జారీ చేసే సర్వ దర్శన టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను కేటాయించనున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం 9 కేంద్రాల వద్ద 94 కౌంటర్లు ద్వారా టికెట్లు ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు.
రోజు మొత్తంలో 42,500 చొప్పున మొత్తం 4.25 లక్షల టికెట్లను వైకుంఠ ద్వార దర్శనం కోసం కేటాయించినట్లు టీటీడీ(TTD) తెలిపింది. ఈ నెల 23 నుంచి 2024 జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం సుమారు 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ పది రోజుల పాటు సిఫారుసు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. వైకుంఠ ద్వారా దర్శన టికెట్లను డిసెంబర్ 22 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇవ్వనున్నారు. భక్తులు క్యూలైన్ లో వేచి ఉండకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకోవాలని టీటీడీ తెలిపింది.
తిరుపతిలో టిక్కెట్లు తీసుకున్న తర్వాతనే తిరుమలకు రావాలని భక్తులకు సూచించారు టీటీడీ అధికారులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23న తెల్లవారుజాము నుంచి 1.45 గంటల నుంచి తిరుమలలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు.
ఈ దర్శనాన్ని పది రోజుల పాటు భక్తులకు అందించనున్నారు. జనవరి 1 అర్థరాత్రి నుంచి వైకుంఠ ద్వారా దర్శనం ఆపడం జరుగుతుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 22న టీటీడీ విష్ణు నివాస్, శ్రీనివాసం, గోవిందరాజ చౌల్ట్రీస్, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదాన్, జీవ కోన హైస్కూల్, ఎంఆర్ పల్లి జెడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామా నాయుడు స్కూల్లో అందుబాటులో టోకెన్లను అందుబాటులో ఉంచనున్నారు.
Also read: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..