TTD: రమణ దీక్షితులను పదవి నుంచి తప్పించిన టీటీడీ..కారణం ఇదే..!

తిరుమల రమణదీక్షితులను తొలగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. సీఎం జగన్‌, టీటీడీ అధికారుల మీద రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనను పదవి నుంచి తప్పిస్తున్నట్లు టీటీడీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందన్నారు.

New Update
TTD: రమణ దీక్షితులను పదవి నుంచి తప్పించిన టీటీడీ..కారణం ఇదే..!

Also Read: జ్ఞాన‌వాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు!

కాగా, రమణ దీక్షితులపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు అయింది. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ప్రతిష్ఠ దిగజార్చేలా…

ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ అధికారి మురళీ సందీప్‌ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు సెక్షన్‌ 153ఏ, 295, 295ఏ, 505(2), రెడ్‌విత్‌ 120 మేరకు కేసు నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణదీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది.

Advertisment
తాజా కథనాలు