TTD MEETING:ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం! తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ అయిన తరువాత భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఆయన పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. By Bhavana 05 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ అయిన తరువాత భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఆయన పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామకోటి తరహాలో గోవింద కోటి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు పాలక మండలి వెల్లడించింది. ఈ గోవింద కోటి రాసేందుకు 25 సంవత్సరాల వయస్సు లోపు యువతీయువకులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మ వ్యాప్తి విస్తృతంగా జరగాలని, సంస్కృతి పరిరక్షణ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వారు వెల్లడించారు. నవీనతరంలో భక్తిభావనను పెంపొందించుకునేందుకు గోవింద కోటి కార్యక్రమం తీసుకొస్తున్నామని చైర్మన్ వివరించారు. గోవింద కోటి రాసిన వారి కుటుంబానికి ఒక్కసారి విఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం అని పేర్కొన్నారు. అతి త్వరలోనే కేజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థి కూడా సులభంగా చదివేలా 20 పేజీల భగవద్గీత పుస్తకాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోటి పుస్తకాలు ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందజేస్తామని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. 49.5 కోట్లతో తిరుపతిలో ఉద్యోగస్థుల క్వార్టర్స్ లకు మరమ్మత్తులు చేపడతామని తెలిపారు. శ్రీవారి పొటులో 413 కొత్త ఉద్యోగుల భర్తీ చేయాలని నిర్ణయం... ఉద్యోగాల భర్తీ కి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి బోర్డు లేఖ పంపినట్లు తెలిపారు. 2.46 కోట్లతో టీటీడీ ఆసుపత్రులలో ఔషధాలు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. టీటీడీ ఉద్యోగులు కేటాయించబోయే ఇళ్లస్థలాలు ఉన్న పాదిరేడు లో రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పనకు 33 కోట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. తిరుపతిలోని టీటీడీ 2&3 సత్రాలు పాతబడ్టాయి...వాటిని తొలగించి...వాటి స్థానంలో అధునాతన భవనాలు నిర్మిస్తామని తెలిపారు. 600 కోట్లతో కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిర్మించబోయే కొత్త భవనాలతో 20 వేల మంది భక్తులకు వసతి సదుపాయం కల్పిస్తామని వివరించారు. రేపటి నుండి నడకదారి భక్తులకు కర్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. హైందవ మతంపై ఎంపీ ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యాలను ఖండించిన టీటీడీ చైర్మన్ #ttd #bhumana-karunakar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి