TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!

దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13వ తేదీ నుంచి నుంచి 24వ తేదీ వరకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

New Update
Hyderabad:ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు 5265 ప్రత్యేక బస్సులను (Special Buses) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (Sajjanar) అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు రద్దీ అధికంగా ఉండడంతో అవకాశముండటంతో ఈ మేరకు స్పెషల్ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Railways Offer: రెండు రోజుల టికెట్ ధరతో నెలంతా ప్రయాణం.. ప్రయాణికులకు రైల్వే బంపరాఫర్!

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సజ్జనార్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నట్లు వివరించారు సజ్జనార్. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని వివరించారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియమిస్తున్నట్లు చెప్పారు.

ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా టీఎస్ఆర్టీసీ ఇటీవల తీసుకువచ్చిన గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలని సజ్జనార్ సూచించారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో చేసుకోవాలని ప్రయాణికులను కోరారు. ఇతర సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు