/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
TSPSC: జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు సాధన చేస్తున్నారు. 783 పోస్టులకు 5.5లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: జైలుకెళ్తేనే ఇంటి స్థలం ఇస్తారా.. ఉద్యమకారులకు పథకాలు ఎలా?
ఏళ్ల తరబడి సాగుతున్న వారి నిరీక్షణకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. కమిషన్ చైర్మన్, సభ్యుల రాజీనామాల కారణంగా వచ్చే నెలలో జరగనున్న పరీక్షల కోసం ఎలాంటి ఏర్పాట్లూ జరగలేదు. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పరీక్ష నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది.