TSPSC: టీఎస్‌పీఎస్సీ తాజా మాజీలపై విచారణ?

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించారు. కాగా, లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ గత బోర్డు సభ్యులపై విచారణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

TSPSC: టీఎస్‌పీఎస్సీ తాజా మాజీలపై విచారణ?
New Update

TSPSC: మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని... జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన ఈ పదవిలో పది నెలల పాటు కొనసాగుతారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‍‌గా మహేందర్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యులను కూడా నియమించారు.

ఇది కూడా చదవండి: Budget 2024: ఈ బడ్జెట్ నుంచి ఆశించాల్సిన 6 కీలక అంశాలు ఇవే..!!

రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, రిటైర్డ్ పోస్టల్ డిపార్టుమెంట్ ఆఫీసర్ అమిరుల్లా ఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జేన్కో ఈడీ రామ్మోహన్ రావు, రిజైన్డ్ గ్రూప్-2 ఆఫీసర్ పాల్వాయి రజనీకుమారిలను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. వీరిలో ముగ్గురు సభ్యులతో(అనితా రాజేంద్ర, రజినీకుమారి, యాదయ్య) శుక్రవారం నాడు ప్రమాణస్వీకారం చేయించారు మహేందర్‌ రెడ్డి.

ఇది కూడా చదవండి: ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ

ఈ సంద్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కమిషన్‌ కృషి చేస్తుందని తెలిపారు. టీఎస్‌పీఎస్సీని మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)కు రాజీనామా చేసిన గత బోర్డు సభ్యులపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. లీకేజీ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకూ పలువురు ఉద్యోగులను అరెస్టు చేయగా.. ఇప్పుడు బోర్డు తాజా మాజీల పాత్రపైనా దృష్టి సారించినట్లు సమాచారం.

#tspsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe