TS Tet Results 2023: టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణ టెట్ ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు అధికారులు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ లింక్ తో (https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results) తమ ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు.

New Update
TS TET-2023: తెలంగాణ టెట్ పరీక్షకు హాజరైన వారికి బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన.. వివరాలివే!

TS Tet Results 2023: తెలంగాణ టెట్ (TS TET 2023) ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు అధికారులు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ లింక్ తో తమ ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో టెట్ పరీక్షను ఈ నెల 15వ తేదీన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,052 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పేపర్-1 పరీక్షకు గాను మొత్తం 2,69,557 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో 2,26,744 మంది ఎగ్జామ్ కు హాజరయ్యారు. పేపర్-2 కోసం 2,08,498 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో 1,89,963 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం టీచర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

అయితే.. టెట్ లో అర్హత సాధించిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హత పొందుతారు. ఈ నేపథ్యంలోనే టెట్ ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేశారు అధికారులు. దీంతో టెట్ లో అర్హత సాధించిన వారందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. టెట్ పేపర్-1 పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు బోధించే ఎస్టీజీ (SGT), పేపర్-2 లో క్వాలిఫై అయిన వారికి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ (SA) ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.

Also Read: సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్‌లో భారీ రిక్రూట్‎మెంట్..జీతం లక్ష కంటే ఎక్కువే…!!

తెలంగాణలో నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షకు మొత్తం 80 మార్కులు ఉంటాయి. టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో మొత్తం 100 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ టీచర్ ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు.

 టెట్ ఫలితాల డైరెక్ట్ లింక్: Link

Advertisment