TS Congress: నో హంగ్.. కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆ పార్టీ 65-70 సీట్లు సాధించడం ఖాయం కానుంది. ఈ రోజు సాయంత్రానికి గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం పార్టీ.

New Update
TS Congress: నో హంగ్.. కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ 65 కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఐదు లోపు, ఎంఐఎం 5 స్థానాలను సాధించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత ట్రెండ్స్ ను పరిశీలిస్తే అర్థం అవుతోంది. దీంతో హంగ్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అధికారంలోకి రావడం ఖాయమని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించడానికి ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Election Counting 🔴 Live: తెలంగాణలో దుమ్ములేపుతున్న కాంగ్రెస్. . ఆ జిల్లాల్లో క్లీన్ స్వీప్!

ఇప్పటికే ప్రత్యేక బస్సులు తాజ్ కృష్ణాలో రెడీగా ఉంచారు హస్తం నేతలు. శంషాబాద్ లో రెండు స్పెషల్ ఫ్లయిట్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల కోసం మరో నాలుగు హెలికాఫ్టర్లను కూడా పీసీసీ సిద్ధం చేసింది. మరో వైపు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు.

Advertisment
తాజా కథనాలు