AP: గిరిజనులకు తప్పని వరద కష్టాలు.. తాళ్ల సాయంతో వాగును దాటుతున్న ప్రజలు..!

అల్లూరి జిల్లా ఆకూరు పంచాయతీ పరిధిలోని గిరిజనులకు వరద కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలకు ఆకూరు, బడిగుంట గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాళ్ల సహాయంతో వాగును దాటుతున్నారు. రాకపోకలకు కాలువపై పకడ్బందీ వంతెనను నిర్మించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.

New Update
AP: గిరిజనులకు తప్పని వరద కష్టాలు.. తాళ్ల సాయంతో వాగును దాటుతున్న ప్రజలు..!

Vishaka:  అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ పరిధిలోని గిరిజనులకు వరద కష్టాలు తప్పడం లేదు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. ఈ కారణంగా ఆకూరు, బడిగుంట గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాళ్ల సహాయంతో వాగును దాటాల్సిన పరిస్థితి వచ్చింది. వరదల కారణంగా ఆకూరు, బడిగుంట గ్రామాలకు మధ్య తాళ్ల ఆధారంగా మాత్రమే రాకపోకలు నడుస్తున్నాయి.

Also Read: మోసపోయిన రైతులకు న్యాయం చేయండి.. రైతు సంఘం నాయకుల డిమాండ్..!

ప్రజలు భయం భయంగా వాగును దాటుతున్న పరిస్థతి. గర్భణిలు, పసిపిల్లలతో ఉంటున్న తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమ గ్రామానికి రాకపోకలు జరిపేందుకు కాలువపై పకడ్బందీ వంతెనను నిర్మించాలని వేడుకుంటున్నారు ఆకూరు గొర్రె వారి వీధి గిరిజన ప్రజలు. బడి గుంట గ్రామానికి కూడా కొండ వాగులు పొంగి పొరలడంతో రాకపోకలు నిలిచిపోయాయని వేరే ఊర్లకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు