Crime News: టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష్ణ అరెస్ట్.. కారణం ఇదే..!

టీవీ యాంకర్ ప్రణవ్ ను కిడ్నాప్ చేసిన నిందితురాలు త్రిష్ణ అరెస్ట్ అయ్యారు. మాట్రిమోని వెబ్‌సైట్ లో ప్రణవ్ ఫొటోలు చూసి ఇష్టపడిన త్రిష అతడిని పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
Crime News: టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష్ణ అరెస్ట్.. కారణం ఇదే..!

Trishna Arrested: టీవీ యాంకర్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. ప్రణవ్ ను కిడ్నాప్ చేసిన నిందితురాలు అరెస్ట్ అయింది. రెండేళ్ల క్రితమే ప్రణవ్‌ ఫోటో చూసి ఇష్టపడింది త్రిష్ణ అనే యువతి. అయితే, ప్రణవ్‌ ఫోటోతో చైతన్యరెడ్డి అనే యువకుడు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ప్రొఫైల్‌ ఫోటో నచ్చడంతో చైతన్యరెడ్డిని త్రిష్ణ సంప్రదించింది. ఫోటోలో వ్యక్తి చైతన్యరెడ్డి ఒకరు కాదని తెలియడంతో ప్రణవ్‌ నెంబర్‌ తెలుసుకుని అసలు విషయం చెప్పింది.

Also Read: నిజామాబాద్‌ లో తహశీల్దార్‌ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలి..!

త్రిష్ణ ఇచ్చిన సమాచారంతో తన ఫోటోను వేరొకరు వాడుతున్నారంటూ పోలీస్‌ స్టేషన్‌లో ప్రణవ్‌ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నుంచి ప్రణవ్‌పై మరింత ఇష్టం పెంచుకుంది త్రిష్ణ. అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకు ప్రణవ్‌ ఒప్పుకోలేదు. దీంతో త్రిష్ణ కిడ్నాప్ స్కెఛ్ వేసింది. హైటెక్‌సిటీలో డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తున్న త్రిష్ణ ఈనెల 11న నలుగురితో ప్రణవ్‌ను కిడ్నాప్‌ చేయించింది. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రణవ్‌.

Also Read: పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నది ఇందుకే: మంత్రి జోగి రమేష్

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేస్తూ ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న ప్రణవ్‌ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో అసలు విషయం తెలుసుకున్న అధికారులు గోగిరెడ్డి త్రిష్ణను అరెస్ట్‌ చేశారు. నిందితులు మరో నలుగురి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ప్రణవ్ ను పెళ్లి చేసుకునేందుకు త్రిష్ణ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Advertisment
తాజా కథనాలు