Pakistan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పై మహ్మద్ హఫీజ్ పైర్!

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టు ఎంపికలో యువ ఆటగాళ్లకు స్థానం కల్పించలేదని మహ్మద్ హఫీజ్‌ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

New Update
Pakistan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పై మహ్మద్ హఫీజ్ పైర్!
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ పాకిస్థాన్ క్రికెట్  బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పీసీబీ జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యుల టీమ్‌లో యువతకు అవకాశం ఇవ్వకపోవడంతో హఫీజ్‌కు కోపం వచ్చింది.  హఫీజ్  జట్టు ఎంపిక తర్వాత సోషల్ మీడియాలోఒక పోస్ట్ పెట్డాడు. ఇదిలా ఉంటే ఫిక్సింగ్ కు పాల్పడి జైలుకెళ్ళి వచ్చిన  క్రికెటర్ మహ్మద్ అమీర్ కు, రిటైర్మెంట్ తర్వాత తిరిగి వచ్చిన ఇమాద్ వసీమ్‌లకు పీసీబీ జట్టులో చోటు కల్పించింది.
హఫీజ్ పోస్ట్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డును టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో దేశవాళీ క్రికెట్‌లో యువతకు అవకాశం కల్పించేందుకు పీసీబీకి మంచి అవకాశం లభించింది, అయితే సీనియర్ , రిటైర్డ్ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. హఫీజ్ చేసిన ఈ వ్యాఖ్యను కొందరు మంచిగా పేర్కొంటుండగా, పలువురు వ్యతిరేకిస్తున్నారు. టీమ్ డైరెక్టర్ గా ఫెయిల్ అయిన తర్వాత హఫీజ్ ఈ విధంగా పీసీబీని టార్గెట్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. హఫీజ్‌ను తోటి ఆటగాళ్లు 'ప్రొఫెసర్' అని పిలుస్తుంటారు.
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ 4 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టులోకి వచ్చాడు. 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టులో అమీర్ సభ్యుడిగా వచ్చాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో ఎంపికకు తాను అందుబాటులో ఉన్నట్లు అమీర్ ఇటీవలే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అతను తిరిగి వచ్చాడు. టీ20 సిరీస్‌కు అమీర్‌తో పాటు రిటైర్డ్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్‌ను కూడా పీసీబీ జట్టులో ఎంపిక చేసింది. వసీం కూడా ప్రపంచకప్‌లో ఆడటం ఖాయమే.
Advertisment
Advertisment
తాజా కథనాలు