Tribal University: ములుగులో ట్రైబల్ యూనివర్సిటీకి లోకసభ ఆమోదం ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమ్మక్క - సారక్క గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు లోకసభ ఆమోదం లభించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించిన కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. By Naren Kumar 08 Dec 2023 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Tribal University: ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమ్మక్క - సారక్క గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు లోకసభ ఆమోదం లభించింది. బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చిన అనంతరం బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించిన కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు బడ్జెట్‌లో కేంద్రం ఇప్పటికే రూ.889.7 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో కేంద్రం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో ఎల్ఫీజీ కనెక్షన్లు డబుల్ అయ్యాయి.. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో భవిష్యత్తులో స్థానికుల ఆకాంక్షలు నెరవేరుతాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలను మెరుగుపరుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గిరిజనుల విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం మాత్రమే కాకుండా, ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే అన్ని కార్యకలాపాలూ గిరిజన విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందని మంత్రి పేర్కొన్నారు. #tribal-university #sammakka-sarakka-tribal-university మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి