రింకూ తో జింబాబ్వేలో చక్కర్లు కొడుతున్న షానిల్ గిల్! టీమిండియా స్టార్ ప్లేయర్ శుభమాన్ గిల్ సోదరి షానిల్ గిల్,భారత క్రికెటర్ రింకూ సింగ్ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది.జింబాబ్వే టూర్ లో రింకూ సింగ్ తో షానిల్ గిల్ నగరంలో తిరుగుతున్న వీడియోను ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది.దీన్ని చూసిన నెటిజన్లు సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. By Durga Rao 12 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి జింబాబ్వేతో భారత జట్టు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్లో భారత జట్టు ఓటమి తర్వాత 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ టీ20 సిరీస్లో రింకూ సింగ్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్ సిరీస్ సందర్భంగా రింకూ సింగ్ను రిజర్వ్ జాబితాకు BCCI పంపింది. దీంతో భారత జట్టులో రింకూ సింగ్కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అభిమానులు పెదవి విరిచారు. ఈ స్థితిలో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో రింకూ డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. దీంతో శివమ్ దూబే ఎంపిక సరైనదేనని విమర్శలు వచ్చాయి. దీని తర్వాత జరిగిన 2వ టీ20 మ్యాచ్లో చివరి క్షణంలో వచ్చిన రింకూ సింగ్ 22 బంతుల్లో 48 పరుగులు చేశాడు. దీంతో రింకూ మరోసారి తన ఫినిషింగ్ స్కిల్స్ చూపించగా.. అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఈ స్థితిలో 2వ టీ20 మ్యాచ్ అనంతరం రింకూ సింగ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత జట్టు కెప్టెన్గా ఉన్న శుభమాన్ గిల్ సోదరి షానిల్ గిల్ జింబాబ్వే టూర్ కు వెళ్లింది.అయితే శుబ్మాన్ గిల్ సొదిరి షానిల్ గిల్ జింబాబ్వేలో రింకూ సింగ్ తో దిగిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.దీన్ని చూసిన నెటిజన్స్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే చర్చ మొదలైంది.ఈ వీడియోను కొంత సేపు తర్వాత షానిల్ గిల్ ఇన్ స్టాగ్రం నుంచి వీడియోను తొలగించారు. #subman-gills-sister #ringu-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి