TRAI New Rule: ఓటీపీలు ఆలస్యంగా వస్తాయి.. ట్రాయ్ కొత్త రూల్స్ తో పెద్ద చిక్కులు..  

ఆన్ లైన్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిపినపుడు పేమెంట్ కోసం ఓటీపీలు అందుకోవడం జరుగుతుంది. అయితే, ఇప్పుడు ఓటీపీలు అందుకోవడంలో ఆలస్యం జరగవచ్చు. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇందుకు కారణం. సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్ రాబోతోంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.  

TRAI New Rule: ఓటీపీలు ఆలస్యంగా వస్తాయి.. ట్రాయ్ కొత్త రూల్స్ తో పెద్ద చిక్కులు..  
New Update

TRAI New Rule: ఆన్ లైన్ లో ఒక టీవీ కొనుకున్నాం. పేమెంట్ చేయడానికి డిటైల్స్ ఇచ్చిన తరువాత బ్యాంకు ఎకౌంట్ అథెంటికేషన్ కోసం మన ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే పేమెంట్ అయిపోతుంది. ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. దాని కోసం పేమెంట్ చేయాలంటే ఓటీపీ అవసరం. ఇలా చాలా పనులకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, ఈ కామర్స్ కంపెనీల నుంచి ఓటీపీలు మన ఫోన్ కు రావడం ద్వారా పనులు పూర్తవుతాయి. కానీ, ఇకపై ఇలా ఓటీపీలు వెంటనే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇందుకు కారణం ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త రూల్. 

TRAI New Rule: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీల వినియోగదారులు సెప్టెంబర్ 1 నుండి, తమ మొబైల్ పరికరాలలో సర్వీసులకు  అలాగే లావాదేవీలకు సంబంధించిన మెసేజెస్ అందుకోవడంలో  సమస్యలు ఎదుర్కోవచ్చు.  స్పామ్, ముఖ్యంగా ఫిషింగ్ ప్రయత్నాలను అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ఆదేశాలు దీనికి కారణం.

ఈ సెప్టెంబరు 1లోగా మెసేజ్ లు పంపినవారు వైట్‌లిస్ట్ చేసి - టెలికాం ప్రొవైడర్‌లతో రిజిస్టర్ అయివుంటే తప్ప URLలు, OTT లింక్‌లు, APK ఫైల్‌లు (Android అప్లికేషన్ ప్యాకేజీలు) లేదా కాల్-బ్యాక్ నంబర్‌లతో కూడిన మెసేజ్ లను  చేయడాన్ని నిలిపివేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించినట్లు ఒక రిపోర్ట్ చెబుతోంది. దీని ప్రకారం, బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమ మెసేజ్ టెంప్లేట్‌లు,  కంటెంట్‌ను టెలికాం ఆపరేటర్‌లతో ఆగస్టు 31లోపు నమోదు చేసుకోవాలి. దీనిని పాటించడంలో వారు విఫలమైతే, అటువంటి అంశాలతో కూడిన మెసేజ్ లను బ్లాక్ చేస్తారు. 

ఏమి మారుతుంది?
TRAI New Rule: ప్రస్తుతం, ఎంటిటీలు తమ హెడర్‌లు, టెంప్లేట్‌లను టెలికాం ప్రొవైడర్‌లతో నమోదు చేసుకుంటున్నాయి. అయితే, అసలు మెసేజ్ లో ఏముందో పర్యవేక్షించే అవకాశం లేదు. అయితే, వచ్చే నెల నుండి, టెలికాం ఆపరేటర్లు వాణిజ్య సందేశాల కంటెంట్‌ను తనిఖీ చేయడానికి అలాగే,  వారి రికార్డులతో సరిదిద్దని వాటిని నిరోధించడానికి ఒక వ్యవస్థను అమలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సదరు మెసేజ్ లో ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటె ఆ మెసేజ్ ను డెలివరీ చేయకుండా నిరోధిస్తారు. 

ఇండస్ట్రీ డేటా ప్రకారం భారతదేశంలో, ప్రతిరోజూ 1.5-1.7 బిలియన్ల కమర్షిలా మెసేజెస్ పంపడం జరుగుతోంది.  ప్రతి నెలా ఇవి దాదాపు 55 బిలియన్లు వరకూ ఉంటాయి.

గడువు పొడిగింపు కోరుతున్న టెలికాం మేజర్లు..
TRAI New Rule: ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్  ప్రకారం , టెలికాం కంపెనీలు తమ బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూట్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కు అప్‌డేట్‌లు అవసరం కాబట్టి ట్రాయ్ ఆదేశాల్ని అమలు చేయడానికి  మరింత సమయం కోరుతున్నాయి. అయితే, పరిస్థితి గురించి తెలిసిన అధికారులు రెగ్యులేటర్ ఇప్పటికే తగినంత సమయం ఇచ్చిందని భావిస్తున్నారు. అందుకే,  గడువును పొడిగించడానికి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. 

#trai-rules #telicom-authority
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe