Jagtial District: గురుకుల స్కూల్ అంటే పేద తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపుతారు. తమ పిల్లలను ఆ స్కూల్ లో చేర్పిస్తే విద్యాబుద్ధులతో పాటు ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఉంటూ మంచిగా ఎదుగుతారు అనే నమ్మకం. కానీ ఆ స్కూల్‌లో ఏం జరుగుతుందో ఏమో.. విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు. మరి కొంత మంది విద్యార్థులు అనారోగ్యం బారినపడుతున్నారు. 15 రోజుల క్రితం ఇద్దరు పిల్లలను పాము కాటేసింది.. అందులో ఒకరు చనిపోయారు.. ఇంకొకరు చికిత్స తీసుకోని ప్రాణాలతో బయటపడ్డారు. అంతేకాకుండా, పాటు కాటు వేసిన రూములోనే పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
వరుస విషాదాలు.. అసలేం జరుగుతుంది?
అయితే, ఈ విషాదం నుంచి తెరుకునేలోపే తాజాగా, మరో విద్యార్థి చనిపోయాడు.. మరో ముగ్గురు అనారోగ్యం బారినపడ్డారు.. వీరంతా ఆరో తరగతి విద్యార్థులే.. ఇలా వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న ఘటన జగిత్యాల జిల్లా పెద్దాపూర్ ప్రభుత్వ గురుకుల స్కూల్‌లో చోటుచేసుకుంటున్నాయి. 6వ తరగతి చదువుతున్న అనిరుద్ అనే విద్యార్థి గత రాత్రి ఉన్నట్టుండి అస్వస్థకు గురైయ్యాడు. గమనించిన ఉపాధ్యాయులు అనిరుద్‌ని మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే, నేడు చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. ఇదే తరగతికి చెందిన మరో ముగ్గురు విద్యార్థులు కూడా అనారోగ్యం బారిన పడటం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
Also Read: మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!
ఎందుకు చనిపోతున్నారు?
ఇలా వరుస విషాదాలు గురుకుల స్కూల్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఆ స్కూల్‌లో పిల్లలను ఉంచాలన్న తల్లిదండ్రులు అమ్మో.. అంటూ భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉంటోంది. పిల్లల ప్రాణాలకు తాము బాధ్యులం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విద్యార్థులు ఉన్నట్టుండి ఇలా ఎందుకు చనిపోతున్నారు? అనారోగ్యం బారిన పడడటానికి గల కారణమేంటి? పాము కాటు నిజమేనా? లేదంటే ఫుడ్ పాయిజన్ జరిగిందా? ఇవి అక్కడి విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలు.
బాధ్యులెవరు?
స్కూల్ యాజమాన్యం పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందా? పిల్లల మృతికి బాధ్యులెవరు? ఈ గురకుల స్కూల్ లో పిల్లలకు భద్రత లేదా? బాధిత తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు. ఇలా వరుస సంఘటనలు జరుగుతున్న అధికారులు చూస్తు ఉంటారా? జరుగుతున్న సంఘటనలపై ఏం చర్యలు తీసుకోరా?. అక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడేం జరుగుతుందో అని భయం భయంగా బ్రతకాల్సిందేనా? మరి వీటికి సమాధానం చెప్పెదెవరు? కార్పొరేట్ స్కూల్స్ లో విద్యార్థులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ విద్యార్ధులపై అధికారులకు లేదా? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.