BRS-BJP Merge: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా.. ఇదిగో ప్రూఫ్: కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లు మొక్కి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు బెయిల్ రావడంతో బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు కానుందని ఆరోపించారు.

BRS-BJP Merge: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా.. ఇదిగో ప్రూఫ్: కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
New Update

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజీపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు కావడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. ఈ బెయిల్ ఊహించిందేనన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని ఆ రెండు పార్టీలు చూశాయన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దాసోహమైందన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారన్నారు. బయటపడ్డ బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. కవితకు బెయిల్ రావడంతో బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందన్నారు. బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం కావడం ఇంకా మిగిలిందన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe