టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సిందే.. గాంధీ భవన్ వద్ద దీక్షకు దిగిన జడ్సన్

వర్ధన్నపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ బక్క జడ్సన్ ఈ రోజు గాంధీభవన్ వద్ద దీక్షకు దిగారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, రాములు నాయక్ కు టికెట్ ఇవ్వాలని లాంబాడీలు సైతం ఆందోళన చేస్తున్నారు.

టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సిందే.. గాంధీ భవన్ వద్ద దీక్షకు దిగిన జడ్సన్
New Update

టికెట్ దక్కని నేతలు, వారి అనుచరులు గాంధీభవన్ (Gandhi Bhavan) వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట్ టికెట్ ఆశించి భంగపడ్డ బక్క జడ్సన్ నిరసన దీక్షకు దీగారు. తనకు టికెట్ ఎందుకు కేటాయించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ నాగరాజుకు పార్టీ వర్ధన్నపేట టికెట్ ను కేటాయించింది. దీంతో జడ్సన్ ఆందోళన చేపట్టారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని తేల్చిచెబుతున్నారు జడ్సన్. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైలెంట్ గా ఉన్న సమయంలోనూ తాను ప్రభుత్వం పై పోరాడానని జడ్సన్ గుర్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hacking: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్?.. యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్!

స్క్రీనింగ్ కమిటీలో కేసీఆర్ కు అమ్ముడుపోయిన వాళ్లు కూడా ఉన్నారని జడ్సన్ ఆరోపిస్తున్నారు. కవిత కళ్లల్లో ఆనందం కోసం తనకు టికెట్ కేటాయించలేదని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే లంబాడీలు సైతం గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.

ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ లోకి జలగం వెంకట్రావు.. అక్కడి నుంచి బరిలోకి?

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఆదివాసి జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్ కు టికెట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఖానాపూర్ లోనూ లంబాడీకే టికెట్ కేటాయించాలని నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేస్తూ మెట్లపై బైఠాయించారు లంబాడీలు.

#telangana-elections-2023 #gandhi-bhavan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe