Toyota Car Sales: టయోటా మోటార్ కార్ప్ 2023లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల తయారీ సంస్థగా అవతరిస్తుంది. ఈ కాలంలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 11.2 మిలియన్ (1.12 కోట్లు) వాహనాలను విక్రయించింది. జర్మనీకి చెందిన కార్ కంపెనీ వోక్స్‌వ్యాగన్‌ను టయోటా వరుసగా నాలుగో ఏడాది అధిగమించింది. అమ్మకాల పరంగా రెండవ స్థానంలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వార్షిక (సంవత్సరానికి) 12% వృద్ధితో 92.4 లక్షల కార్లను విక్రయించింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, దాని అనుబంధ సంస్థలైన డైహట్సు- హినో కూడా కంపెనీ విక్రయాలలో (Toyota Car Sales)వాటాను కలిగి ఉన్నాయి. 2022తో పోల్చితే టొయోటా వాహనాల విక్రయాల్లో 7.2% పెరుగుదల నమోదైంది. దీంతో టయోటా ఉత్పత్తి 2022తో పోలిస్తే 2023లో 8.6% పెరిగి 1.15 కోట్లకు చేరుకుంది. ఉత్తర అమెరికా మరియు యూరప్ వంటి మార్కెట్‌లలో స్థిరమైన డిమాండ్‌తో పాటు సరఫరా గొలుసులో మెరుగుదలలు టయోటా అమ్మకాలను పెంచడంలో సహాయపడింది.
హైబ్రిడ్ మోడళ్ల కారణంగా..
గ్లోబల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ అమ్మకాల పనితీరు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల విక్రయదారు అయిన టయోటా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో చాలా వెనుకబడి ఉంది. గతేడాది 1.04 లక్షల ఈవీలను మాత్రమే విక్రయించింది.
Also Read: అమ్మో! బంగారం.. మళ్ళీ పెరుగుతోంది.. వెండి తగ్గనంటోంది
టయోటా అమ్మకాలలో అత్యధిక వాటా హైబ్రిడ్ మోడల్స్ (Toyota Car Sales)కారణంగా ఉంది. BYD ఎలక్ట్రిక్ - హైబ్రిడ్ కార్ల విక్రయాలలో 30.2 లక్షలతో అగ్రస్థానంలో ఉంది. 2023లో 18.1 లక్షల EVలను విక్రయించిన టెస్లా తర్వాతి స్థానంలో ఉంది.
భారతదేశంలో..
భారత మార్కెట్ విషయానికి వస్తే 2023లో టయోటా మొత్తం 2,31,469 వాహనాలను విక్రయించింది. అదే సమయంలో, డిసెంబర్-2023లో కంపెనీ 21,372 కార్లను విక్రయించింది. కంపెనీ వార్షిక ప్రాతిపదికన లాభాలను ఆర్జించింది. డిసెంబర్-2022లో 10,421 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అదే సమయంలో, నవంబర్-2023లో, కంపెనీ 17,818 యూనిట్లను విక్రయించింది. ఇది నవంబర్-2023 కంటే 3,554 యూనిట్లు ఎక్కువ.
Watch this Interesting Video :