Traditional ware: ఈ ఐదు డ్రెస్సులు అమ్మాయిల ఫేవరెట్.. అబ్బాయిలు చూపు తిప్పుకోలేరు బాసూ!

భారత దేశం అంటే సంప్రదాయాలకు పెట్టింది పేరు. పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు ఏవైనా సరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది దుస్తులే. పెళ్లిళ్లు, పండుగలు అంటే..ముందుగా ఆడవారు ధరించే దుస్తుల్లోనే సగం పండుగ కనిపిస్తుంది.

New Update
Traditional ware: ఈ ఐదు డ్రెస్సులు అమ్మాయిల ఫేవరెట్.. అబ్బాయిలు చూపు తిప్పుకోలేరు బాసూ!

భారత దేశం అంటే సంప్రదాయాలకు పెట్టింది పేరు. పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు ఏవైనా సరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది దుస్తులే. పెళ్లిళ్లు, పండుగలు అంటే..ముందుగా ఆడవారు ధరించే దుస్తుల్లోనే సగం పండుగ కనిపిస్తుంది. వాటిలో ముఖ్యంగా చీర. ఏ సందర్భంలో అయినా సరే చీర కట్టుకుంటే ఆ అందమే వేరు.

publive-image

Saree:  ఎంతటి వారిని అయినా సరే కట్టిపడిసే శక్తి చీరకు ఉంది. చీరను ఎన్ని విధాలుగా కట్టిన దాని అందం వేరు. చీరలు ఇప్పుడు వివిధ రకాల డిజైన్లతో వస్తున్నాయి. ప్రతి మహిళా వార్డ్‌ రోబ్‌ లో చీరలు కచ్చితంగా ఉంటాయి. రిచ్‌ పాస్టల్స్‌ లో సాదా పట్టు చీర, బెల్ట్ చీరలతో వివిధ ప్రయోగాలు చేయోచ్చు.

publive-image

చీర తరువాత అంతటి స్థానం సల్వార్‌ కమీజ్‌ది. దుపట్టాతో కూడిన ఈ సల్వార్‌ కమీజ్‌ గత కొన్నేళ్లలో అనేక రూపాలను సంతరించుకుంది.ఇవి చాలా సౌకర్యవంతమైన దుస్తులు. ఎక్కడికైనా సులభంగా వేసుకుని వెళ్లిగలిగే దుస్తులు.

Patiyala Suit: వీటి తరువాత స్థానం పాటియాలా సూట్ ది. ఇవి సాధారణ బాటమ్‌ ల కంటే కూడా వెడల్పుగా ఉంటాయి. దీంతో చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇవి భారత్ లో బాగా ప్రాచుర్యం పొందిన దుస్తులు. ప్యాంటుపై ఉన్న ప్లీట్స్ మీ దుస్తులకు పూర్తిస్థాయి రూపాన్ని అందిస్తాయి.పండుగలు, వేడుకలకు సరైన దుస్తులు.

publive-image

anarkali: అనార్కలీ: భారతీయ దుస్తులలో అత్యంత ప్రాచుర్యం పొందిన దుస్తుల్లో అనార్కలీ ఒకటి. ఇప్పుడు ప్రతి ఈవెంట్‌ కు ఈ దుస్తుల్లో అందమైన భామలు మెరుస్తున్నారు. అనార్కలి సూట్ అనేది చాలా సంవత్సరాలుగా భారతీయ సాంప్రదాయ దుస్తుల శైలిలో ప్రధానమైన డ్రెస్‌. ఫ్లోర్ లెంగ్త్ అనార్కలి సూట్‌లకు ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ స్థానం ఉంటుంది.

publive-image

lehanga: లెహంగాలు: ప్రస్తుతం లెహంగాలు భారతీయ వధువులు వివాహాలకు ఎక్కువగా ధరిస్తున్నారు. మార్కెట్లో లభించే వెరైటీలతో తమ ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకుంటున్నారు. చాలా మంది వధువులు తమ వివాహానికి ముందు జరిగే వేడుకలకు లెహంగాలు ధరించేలా చూసుకుంటున్నారు.

publive-image

kurthas: కుర్తాలు: ఆధునిక భారతీయ మహిళలు కుర్తాలు ధరించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవి ధరించడం సులభం. ఏ సందర్భంలోనైనా సరిపోయేలా అనేక రకాలుగా స్టైల్ చేసుకోవచ్చు.

publive-image

Also read: ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌.. అమితాబ్‌ కి జరిమానా!

Advertisment
తాజా కథనాలు