Tomato Price falls: ఒక్కసారిగా పతనమైన టమాటా.. కన్నీరు పెడుతున్న రైతులు!! గత కొద్ది రోజుల క్రితం టమాటా అనగానే ఆమడ దూరం పారిపోయేవారు. అంతలా ఆకాన్నంటాయి టమాటా ధరలు. ఒక్కసారిగా కిలో రూ.200 వరకూ వెళ్లాయి. దీంతో రైతులకు కాసుల పంట కురిశాయి. కానీ వినియోగదారుడు మాత్రం చితికిపోయాడు. టమాటాలు అమ్మి ఒక్కో ప్రాంతాల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు రైతులు. ఇప్పుడు ఇదే టమాటా ధరలు రైతును కంట తడి పెట్టిస్తున్నాయి. మొన్నటి వరకూ కిలో రూ.200కి పైగా లభించే టమాటాలు ఇప్పుడు కిలో రూ.9 నుంచి రూ.30 పలుకుతున్నాయి. దీంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. By E. Chinni 01 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి Tomato Price falls farmers are disappointed Rs 9 per kg in Madanapalle Market Yard: గత కొద్ది రోజుల క్రితం టమాటా అనగానే ఆమడ దూరం పారిపోయేవారు. అంతలా ఆకాన్నంటాయి టమాటా ధరలు. ఒక్కసారిగా కిలో రూ.200 వరకూ వెళ్లాయి. దీంతో రైతులకు కాసుల పంట కురిశాయి. కానీ వినియోగదారుడు మాత్రం చితికిపోయాడు. టమాటాలు అమ్మి ఒక్కో ప్రాంతాల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు రైతులు. ఇప్పుడు ఇదే టమాటా ధరలు రైతును కంట తడి పెట్టిస్తున్నాయి. మొన్నటి వరకూ కిలో రూ.200కి పైగా లభించే టమాటాలు ఇప్పుడు కిలో రూ.9 నుంచి రూ.30 పలుకుతున్నాయి. దీంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మొన్నటి వరకూ మార్కెట్ కు వచ్చి జేబు నిండా డబ్బులు పట్టికెళ్లిన రైతు.. ఇప్పుడు చేతి ఖర్చులకు కూడా డబ్బులు ముట్టడంట లేదు. చిత్తూరు జిల్లాలో సంప్రదాయ పంటగా టమాటా: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత రైతాంగం ప్రధాన సాంప్రదాయ పంటగా సాగు చేస్తున్న టమాటా ఈసారి రైతుని సంపన్నుడ్ని కూడా చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ పలకడంతో సాగు చేసిన టమోటా ను పంటను కాపలా కాయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితికి నెలకొంది. జులై నెలాఖరు వరకూ కిలో రూ.150 నుంచి రూ.200 పలికిన టమాటా ధర తర్వాత తగ్గు ముఖం పడుతూ వచ్చింది. ఆగష్టు 14వ తేదీ వరకూ తగ్గుతూ వచ్చిన టమాటా ధరలు ఆ తర్వాత ఒక్కసారిగా పతనమయ్యాయి. ఆగస్టు 14న కిలో రూ.22కు చేరుకున్న టమాటా కనిష్ఠ ధర: ఆగస్టు 14న కిలో టమాటా కనిష్ఠ ధర రూ.22కు చేరుకుంది. ఆ రోజున 282 మెట్రిక్ టన్నుల టమోటా మదనపల్లి మార్కెట్ కు రైతులు అమ్మకానికి తీసుకుని రాగా ట్రేడర్లు నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో గిట్టుబాటు ధర రాకపోయింది. క్రమేపి టమోటా ధరలు తగ్గుతూ రావడం ప్రారంభం కాగా ఇతర ప్రాంతాల్లో టమాటా దిగుబడులు మొదలయ్యాయి. దీంతో మదనపల్లి మార్కెట్ టమాటా డిమాండ్ పడిపోయింది. పక్కనే ఉన్న కర్ణాటక, అనంతపురం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో టమోటా సాగు విస్తారంగా జరగడం, దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో మదనపల్లి మార్కెట్ వైపుకు టమాటా కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఇటువైపు చూడడం మానేశారు. కమిషన్ పోగా రైతు చేతికి అందేది కిలో కు రూ. 7 మాత్రమే: ప్రస్తుతం 300 లోపు మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లి మార్కెట్ కు వస్తున్నా కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్లు రాకపోవడం లేదు. దీంతో ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కిలో టమాటా ధర రూ.9 కి చేరింది. మదనపల్లి మార్కెట్ లో జాక్పాట్ విధానం అమల్లో ఉండడంతో కమిషన్ విధానం టమాటా రైతును మరో దెబ్బతీస్తోంది. కిలో టమాటా కు రూ.9 దక్కుతుంటే కమిషన్ పోగా చేతికి అందేది కిలో కు రూ. 7 మాత్రమే. దీంతో 20 రోజుల క్రితం వరకు మదనపల్లి మార్కెట్ కు టమోటాలు తీసుకొచ్చి జేబునుండా డబ్బులు తీసుకెళ్లిన టమోటా రైతు ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. టమోటా సాగు చేసి చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇవి కూడా చదవండి: TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో.. Aditya L1 Mission ప్రయోగానికి అంతా సెట్ IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..! #tomato-price-falls #madanapalle-market-yard #farmers-are-disappointed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి