HBD Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్

అల్లు అర్జున్.. ఇది పేరు కాదు.. ఇట్స్‌ ఏ బ్రాండ్‌. బన్ని డ్యాన్స్‌ వేస్తే యావత్‌ ప్రపంచం అదే స్టెప్‌ వేస్తుంది. ఎక్కడైనా.. ఐకాన్‌ స్టార్‌ స్టెప్ కనిపించాల్సిందే! ఏప్రిల్‌ 8 అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!

HBD Allu Arjun: ''అల్లు'' వారి విల్లు... నట మత్స్య యంత్రాన్ని చేధించిన ''అర్జును''డికి హ్యాపీ బర్త్‌ డే!
New Update

HBD Allu Arjun: టాలీవుడ్ దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్, పవర్ స్టార్ మేనల్లుడిగా ప్రేక్షకులకు పరిచయమైన అల్లు అర్జున్.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం, ఆ పాత్రకు న్యాయం చేయడం అతని నైజం. 20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. 'పుష్ప' సినిమాతో తగ్గేదేలే అంటూ భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంత చేసుకున్నారు ఈ అల్లు హీరో.



అల్లు అర్జున్ సినీ కెరీర్

2003 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'గంగోత్రి' సినిమాతో బన్నీ తన కెరీర్ ప్రారంభించారు. కానీ ఈ సినిమాతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారు. ఆ తర్వాత 'ఆర్య' సినిమా కోసం సుకుమార్ తో జతకట్టిన బన్నీ ఇక కెరీర్ లో వెనుదిరిగి చూడలేదు. అందమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ కల్ట్ క్లాసిక్ తో బన్నీ రేంజే మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీ అయిపోయారు. 2009 లో 'వేదం' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

publive-image

హ్యాట్రిక్ హిట్స్

త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడు హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు ఈ స్టార్ హీరో. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 2020లో విడుదలైన అలా వైకుంఠపులో చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన టాప్​ 10 తెలుగు చిత్రాలలో ఒకటి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 262 కోట్లు వసూళ్లను రాబట్టింది.

publive-image

పుష్పగాడి రూల్

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన మూడో చిత్రం పుష్ప. 2022 లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగింది. ఈ సినిమాలో బన్నీ నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి సౌత్ హీరోగా రికార్డు సృస్టించాడు. పుష్ప సీక్వెల్ పుష్ప 2 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు

publive-image

మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహం

పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పుష్ప చిత్రంలోని ఐకానిక్ 'తగ్గేదే లే' పోజుతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

Also Read: HBD Naga Chaitanya: నేడు అక్కినేని వారసుడు నాగ చైతన్య బర్త్ డే.. 14 ఏళ్ల కెరియర్ లో ప్రతీ సినిమా స్పెషలే!

#allu-arjun
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe