Actor Fish Venkat : నడవలేని స్థితిలో 'గబ్బర్ సింగ్' విలన్.. సాయం కోసం కన్నీళ్లు, ఆదుకున్న నిర్మాతల మండలి

నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. కిడ్నీలు పాడవడంతో వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ముందుకొచ్చింది. ఈ మేరకు స్వయంగా ఆయనకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

Actor Fish Venkat : నడవలేని స్థితిలో 'గబ్బర్ సింగ్' విలన్.. సాయం కోసం కన్నీళ్లు, ఆదుకున్న నిర్మాతల మండలి
New Update

Actor Fish Venkat : ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ అయింది. తాను ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు. ఫిష్ వెంక‌ట్ పరిస్థితిని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ఆయనకు సాయం చేయ‌డంటూ ప్ర‌భుత్వంతో పాటు తెలుగు హీరోల‌కు సందేశాలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ముందుకొచ్చింది.

Also Read : సుహాస్ కొత్త సినిమా విడుదల వాయిదా.. కారణం ఇదే..!

ఈ మేరకు స్వయంగా ఆయనకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. టి ఎఫ్ పి సి ట్రెజరర్, నిర్మాత రామసత్యనారాయణ, టి ఎఫ్ పి సి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, దర్శకుడు కె. అజయ్ కుమార్, తెలుగు ఫిలింఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కలిసి ఈ చెక్ ను ఫిష్ వెంకట్ కు అందజేశారు.

#actor-fish-venkat #tfpc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe