/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rate-Today-jpg.webp)
Today Gold Price: నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిన్న కాస్త తగ్గినట్టు కనిపించడంతో మన దేశంలోనూ ఆ ప్రభావం ఉంటుందని భావించారు. అయితే, నిన్న మన దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటలో నడిచాయి. ఇక వెండి విషయానికి వస్తే నిన్న పెరిగిన వెండి ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే ఆగస్టు 29న బంగారం ధరలు కాస్త పెరుగుదల చూపించింది. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుదల నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Today Gold Price: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.220 పైకెగసింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.210 పెరిగింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 ఎగిసింది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి
22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 67,150
24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,250
ఇక విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .
22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 67,150
24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,250
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకెగశాయి . ఈరోజు పెరుగుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 67,300
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,340
Today Gold Price: బంగారం ధరలు స్థిరంగా ఉంటే . . మరోవైపు ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు ఈరోజు మార్పులు లేకుండా నిలిచాయి. హైదరాబాద్ లోనూ , ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 93,500 గానూ , ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 88,500 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .
ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈరోజు అంటే ఆగస్టు 29 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,513 డాలర్ల వద్ద ఉన్నాయి . అలాగే వెండి ధరలు కూడా తగ్గుదల బాటలో కేజీకి 944 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.