Iron Rich Drinks: శరీరంలోని హిమోగ్లోబిన్ లెవల్స్ కోసం ఈ ఐదు సూపర్ డ్రింక్స్! శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత లేకపోతే రక్తహీనత ఏర్పడవచ్చు. శరీరానికి హిమోగ్లోబిన్ చాలా ముఖ్యం. అందుకే ఈ ప్రోటీన్ లెవల్స్ పెరగడానికి ఐరన్ రిచ్ డ్రింక్స్ తాగాలి. ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకోండి! By Durga Rao 16 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మానవ శరీరానికి అవసరమైన ముఖ్యమైన ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఇది రక్తం ద్వారా శరీర భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ఈ ప్రక్రియను ఆక్సిహెమోగ్లోబిన్‌గా పేర్కొంటారు. ఇదే హిమోగ్లోబిన్ శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తుంది.మానవ శరీరంలోని ఎముక మజ్జ కణాల్లో హిమోగ్లోబిన్ తయారవుతుంది. అయితే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత లేకపోతే రక్తహీనత ఏర్పడవచ్చు. అందుకే ఈ ప్రోటీన్ లెవల్స్ పెరగడానికి ఐరన్ రిచ్ డ్రింక్స్ తాగాలి. ముఖ్యంగా 5 రకాల డ్రింక్స్‌ను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అవేంటంటే.. పుదీనా జ్యూస్: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలతో కూడిన పుదీనాలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుదీనా జ్యూస్ తాగితే శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుదలకు కారణమవుతుంది. 100 గ్రాముల పుదీనా ఆకుల్లో దాదాపు 16 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. రోజూ ఉదయం ఒక కప్పు పుదీనా జ్యూస్ తాగితే 4 మిల్లీగ్రాముల ఐరన్ శరీరానికి అందుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, అలాగే రీఫ్రెష్ ఇస్తుంది. బఠానీ ప్రోటీన్ షేక్: పీ ప్రోటీన్ పౌడర్‌లో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. 20 గ్రాముల పసుపు బఠానీ ప్రోటీన్ తీసుకుంటే రోజువారీ ఐరన్ అవసరాల్లో 30 శాతం పొందవచ్చు. షేక్స్, స్మూతీస్ రూపంలో బఠానీ ప్రోటీన్ షేక్‌ను ఆస్వాదించవచ్చు. బరువును పెరగకుండా ఉండాలంటే ప్లెయిన్ లేదా తియ్యని ప్రోటీన్‌ను ఎంచుకోవాలి. నువ్వులు, ఖర్జూర స్మూతీస్: రుచికరంగా ఉండే స్మూతీ రెసిపీతో శరీరానికి అవసరమైన ఐరన్ కంటెంట్ పొందవచ్చు. నువ్వులు, ఖర్జూరాలతో చేసిన స్మూతీస్ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. నువ్వుల్లో భాస్వరం, విటమిన్ ఇ, జింక్ కంటెంట్ లభిస్తుంది. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచుతాయి. పాలలో తేనె కలిపి ఖర్జూరాలు, నువ్వులను నానబెట్టాలి. అవి మెత్తగా అయిన తర్వాత బ్లెండ్ చేయాలి. దీంతో రుచికరమైన స్మూతీ రెడీ అవుతుంది. బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బీటైన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ దుంపలతో జ్యూస్ చేసుకొని తాగితే ఎర్రరక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఎందుకంటే ప్రతి 100 గ్రాముల బీట్‌రూట్‌లో దాదాపు 0.8 mg ఐరన్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లెవల్స్ పెరగడానికి తోడ్పడుతుంది. ప్రూనే జ్యూస్: ప్లమ్ అనే చెట్టుకు ప్రూనే పండ్లు కాస్తాయి. వీటిని బాగా డ్రై చేస్తారు. ప్రూనేలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి నుంచి మొక్క ఆధారిత ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు ప్రూనే జ్యూస్ నుంచి 2.8 mg ఐరన్ పొందవచ్చు. శరీరానికి రోజువారీ అవసరాల్లో దాదాపు ఐదో వంతు ఐరన్ దీని నుంచి లభిస్తుంది. రెగ్యులర్‌గా ఈ డ్రింక్ తాగితే శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ పేషంట్స్ ప్రూనే జ్యూస్ తాగడం మంచిది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. #iron-rich-drinks #five-super-drinks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి