Padmavati Express : తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు-తప్పిన ముప్పు.!

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వ్యాపించాయి. బీ 4 కోచ్ లోని పొగలు కమ్ముకున్నాయి. దీంతో కాజీపేటలో గంటన్నర పాటు రైలును నిలిపివేశారు.సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు స్టేషన్ ఘన్ పూర్ దాటిన తర్వాత పొగలు కమ్ముకున్నాయి.

Railway : వేసవి సెలవులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వేశాఖ
New Update

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వ్యాపించాయి. బీ 4 కోచ్ లోని పొగలు కమ్ముకున్నాయి. దీంతో కాజీపేటలో గంటన్నర పాటు రైలును నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన పద్మావతి రైలు స్టేషన్ ఘన్ పూర్ దాటిన తర్వాత పొగలు కమ్ముకున్నాయి. గమనించిన ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును నెమ్మదిగా కాజీపేట వరకు తీసుకువచ్చారు. బ్యాటరీ క్యాప్ లీక్ అవ్వడంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించారు. అనంతరం కాజీపేట నుంచి రాత్రి 10గంటలకు తిరుపతి బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు పొగలు గమనించిన సమాచారం అందివ్వడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడు కేటీఆర్..డిప్యూటీ సీఎం వార్నింగ్..!

#padmavati-express
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe