తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు (brahmotsavalu) సర్వం సిద్ధం చేసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గత నెలలో జరిపిన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రాకపోవడం వల్ల ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశాలున్నట్లు ఆయన వివరించారు.
ఆయన అన్నమయ్య భవనంలో టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొని భక్తులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చారు. ఈ సారి బ్రహ్మోత్సవాల సమయంలో దసరా సెలవులు కూడా ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని వారు వివరిస్తున్నారు.
Also Read: ఆ సరస్సు ఎప్పుడైనా తెగిపోవచ్చు..మూడు జిల్లాలకు హెచ్చరిక!
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 19 న గరుడ సేవ నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజున అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కాబట్టి వారి భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని కనుమ దారిలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు ఆయన వివరించారు. ఈ నెల 23న జరిగే చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు దర్శనానికి వీలుగా 2 లక్షల టికెట్లను త్వరలోనే ఆన్‌లైన్ లో విడుదల చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 10 రోజుల వ్యవధిలో ఆఫ్‌లైన్ లో 5 లక్షల టికెట్లను ఇస్తామన్నారు. ఈ నెల 29వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని 28వ తేదీన రాత్రి 7.05 గంటల నుంచి మరుసటి రోజు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటల వరకు మూసి వేస్తామని చెప్పారు.
Also Read: ఈ గింజలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే..దెబ్బకి దరిద్రం పరార్!