Blue Light Effects on Eye: ఈ మధ్య కాలం ఫోన్స్, కంప్యూటర్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గంటల తరబడి ఫోన్స్ చూస్తూ ఉండిపోతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ముఖ్యంగా ఫోన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ కంటి పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతే కాదు ఇది చర్మ సమస్యలకు కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లూ లైట్ కు ప్రభావం ఎక్కువైనప్పుడు.. ఇది శరీరంలో నిద్ర సంబంధించిన హార్మోన్స్ ను ప్రభావితం చేసి.. నిద్ర సమస్యలకు దారితీస్తుంది. బ్లూ లైట్ వల్ల కళ్ళు స్ట్రైన్ అయినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కళ్ళు పొడిబారడం, కళ్ళలో చిరాకు, తలనొప్పి, అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకని బ్లూ లైట్ నుంచి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఈ టిప్స్ పాటించండి.
బ్లూ లైట్ నుంచి కంటిని రక్షించే టిప్స్
బ్లూ లైట్ ఫిల్టర్స్
ఇవి ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో ఉండే ఒక సాఫ్ట్ వేర్. ఈ బ్లూ లైట్ ఫిల్టర్స్ మొబైల్స్, కంప్యూటర్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది స్క్రీన్ కలర్ టెంపరేచర్ ను అడ్జెస్ట్ చేస్తుంది. దీని వల్ల కళ్ళ పై ఒత్తిడి తగ్గుతుంది. అందుకే మీ ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్ లో ఈ ఫీచర్ ఉండేలా చూసుకోండి.
సరైన వెలుతురులో ఉండండి
కొంత మంది చీకటిగా ఉన్న ప్రదేశాల్లో ఫోన్స్ వాడుతుంటారు. ఇది కంటి ఆరోగ్యానికి మరింత ప్రమాదం. చీకటిగా ఉన్నప్పుడు బ్లూ లైట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కళ్ళు స్ట్రైన్ అవుతాయి. అందుకే సరైన వెలుతురులో ఉండడానికి ప్రయత్నించండి.
Also Read: Sankranthi 2024: సంక్రాంతికి రంగరంగుల ముగ్గులు, మధ్యలో గొబ్బెలు.. కారణమేంటో తెలుసా?
స్క్రీన్ సెట్టింగ్స్
ఫోన్స్, కంప్యూటర్ స్క్రీన్స్ పై ఎక్కువ బ్రైట్ నెస్ ఉంటుంది. అందుకని మీ స్క్రీన్ బ్రైట్ నెస్ వీలైనంత తక్కువ ఉండేలా సెట్ చేసుకోండి. దీని వల్ల కంటి పై బ్లూ లైట్ ప్రభావం తగ్గుతుంది.
స్క్రీన్ టైం తగ్గించండి
కొంత మంది ఉదయం సిస్టమ్స్, ఫోన్స్ ముందు కూర్చుంటే.. సాయంత్రమైన పక్కకు వెళ్లరు. ఇలా అస్సలు చేయకూడదు. ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కారణమవుతుంది. మధ్య మధ్యలో అరగంటకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం మంచిది.
ఆరెంజ్ గ్లాసెస్
సాధారణ గ్లాసెస్ కంటే ఆరెంజ్ లెన్సెస్ బ్లూ లైట్ నుంచి వచ్చే కాంతిని ఎక్కువగా తగ్గిస్తాయి. అందుకే డార్క్ ప్లేసెస్ లో ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడేటప్పడు వీటిని పెట్టుకుంటే మంచిది. అలాగే మంచి నిద్రకు కూడా ఇవి సహాయపడతాయి.
సరైన నిద్ర
ఫోన్స్, గ్యాడ్జెట్స్ అతిగా చూడడం చేత కళ్ళు బాగా ఒత్తిడికి గురవుతాయి. కావున సరైన నిద్ర తప్పనిసరి. రోజుకు 7-8 గంటల పాటు నిద్రపోతే.. కళ్ళ ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాదు సరైన పోషకారాహారం కూడా తప్పనిసరి.
Also Read: Palmyra Sprout: తాటి తేగలు తింటే.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!