ఆన్‌లైన్‌ స్కామ్స్‌కు చెక్ పెట్టే టిప్స్..

నేటి డిజిటల్‌ ప్రపంచంలో దాదాపు అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తోంది. చాలా మంది ఇంటర్నెట్‌ వాడుతున్నారు. అదే సంఖ్యలో ఆన్‌లైన్‌ స్కామ్స్ సంఖ్య కూడా పెరిగింది.ఈ క్రమంలో ఆండ్రాయిడ్‌ యాప్‌ పర్మిషన్లను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో తెలుసుకుందాం.

New Update
ఆన్‌లైన్‌ స్కామ్స్‌కు చెక్ పెట్టే టిప్స్..

ప్రజలను మోసం చేసి అందినకాడికి దోచుకోవాలని సైబర్ నేరగాళ్లు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు డిజిటల్ ప్రైవసీని రక్షించడం, ఫైనాన్షియల్ అకౌంట్లను మానిటర్‌ చేయడం కీలకం. డిజిటల్‌ ప్రైవసీ రక్షణలో భాగంగా ముందు డివైజ్‌లో యాప్ పర్మిషన్‌లు సక్రమంగా మేనేజ్‌ చేయాలి. లేకపోతే ఫోన్‌లో ఉండే వ్యక్తిగత, ఆర్థిక పరమైన కీలక సమాచారం మోసగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.

ఆండ్రాయిడ్‌లో పర్మిషన్‌ సిస్టమ్‌తో కెమెరా, కరెంట్‌ లొకేషన్‌, మైక్రోఫోన్‌కి యాక్సెస్‌ను కంట్రోల్ చేయవచ్చు. టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌తో, ఇప్పుడు అన్ని రకాల యాప్స్ నోటిఫికేషన్‌లను పంపడం ద్వారా, డివైజ్‌లోని ఫీచర్‌లను ఉపయోగించడానికి యూజర్ పర్మిషన్‌ కోరాలి. అలాగే వినియోగదారులు తమ డివైజ్‌ సెట్టింగ్స్‌లో ఒకే యాప్ లేదా పర్మిషన్‌ టైప్‌ ద్వారా పర్మిషన్‌లు మాడిఫై చేసే సదుపాయం ఉంది.

- ‘ఓన్లీ వైల్‌ యూజింగ్‌ ది యాప్’

ఈ సెట్టింగ్ ఆన్ చేసుకొని.. యాప్‌ను యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే మీ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్‌ యాక్సెస్‌ను యాప్‌కు ఇవ్వచ్చు. మీరు యాప్ నుంచి ఎగ్జిట్‌ అయిన తర్వాత ఫీచర్లకు యాక్సెస్ రద్దు అవుతుంది.

- ఆస్క్‌ ఎవ్రీ టైమ్‌

ఈ ఆప్షన్‌ ఎనేబుల్ చేస్తే, యాప్‌ ఓపెన్‌ చేసిన ప్రతిసారీ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి పర్మిజర్ మంజూరు చేయమని యాప్ మిమ్మల్ని అడుగుతుంది.ఈ ఆప్షన్‌ సెలక్ట్ చేస్తే, యాప్ యూజ్‌ చేస్తున్నప్పుడు కూడా లొకేషన్‌, కెమెరా, మైక్రోఫోన్‌కు పూర్తిగా యాక్సెస్ లభించదు.

* యాప్ పర్మిషన్స్ ఎలా మార్చాలి?

– మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సెట్టింగ్స్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేయండి.

– యాప్స్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేసి పర్మిషన్స్‌ మార్చాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.

– తర్వాత, యాప్‌పైన ట్యాప్‌ చేసి, పర్మిషన్స్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేయండి.

– కెమెరా, కాంటాక్ట్స్‌, లొకేషన్‌, మైక్రోఫోన్‌ సహా పర్మిషన్స్‌ లిస్ట్‌ కనిపిస్తుంది.

– మేనేజ్‌ చేయాలనుకుంటున్న పర్మిషన్‌పై నొక్కండి, అనేక ఆప్షన్లు కనిపిస్తాయి.

- ‘అలో వైల్‌ యూజింగ్‌ ది యాప్‌’, ‘డోంట్‌ అలో’, ‘ఆస్క్‌ ఎవ్రీ టైమ్‌ ఫర్‌ ద స్పెసిఫిక్‌ యాప్‌’ వంటి సెట్టింగ్స్ ఎంచుకోండి.

* యాప్ టైప్‌ ఆధారంగా పర్మిషన్స్‌ ఎలా మార్చాలి?

- స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి.

– సెక్యూరిటీ & ప్రైవసీ లేదా ప్రైవసీ (డివైజ్‌ ఆధారంగా) ఆప్షన్‌ ఎంచుకోండి.

– పర్మిషన్ మేనేజర్ లేదా యాప్ పర్మిషన్స్‌పై క్లిక్‌ చేయండి. పర్మిషన్‌ టైప్స్‌ లిస్ట్‌కి రీడైరెక్ట్‌ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు