Bruises: శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!

శరీరంపై మచ్చలుగా మిగిలిపోయే చిన్న చిన్న గాయాలు లెక్కలేనన్ని అవుతుంటాయి. ఇక కొన్ని గాయాలైతే.. రక్తం బయటకు రాకుండానే.. శరీరం లోపల వైపున నీలం రంగులో గడ్డకట్టినట్లుగా ఉండిపోతుంది. వాపు ఏర్పడి నొప్పి వస్తుంది. ఈ గాయాలను, మచ్చలను ఈజీగా తగ్గించే చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. పసుపు, ఆముదం, అలోవేరా. వీటిని గాయం అయిన చోట అప్లై చేస్తే త్వరగా ఆ గాయం మాని, మచ్చ కూడా తగ్గిపోతుందట.

Bruises: శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!
New Update

Tips for Bruises: పిల్లలైనా.. పెద్దలైనా.. వృద్ధులైనా.. ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దెబ్బలు తగిలించుకుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువకులు ఏదో ఒక సందర్భంలో గాయాలపాలవుతుంటారు. మరీ భారీ గాయాలు కాకపోయినా.. శరీరంపై మచ్చలుగా మిగిలిపోయే చిన్న చిన్న గాయాలు లెక్కలేనన్ని అవుతుంటాయి. ఇక కొన్ని గాయాలైతే.. రక్తం బయటకు రాకుండానే.. శరీరం లోపల వైపున నీలం రంగులో రక్తం గడ్డకట్టినట్లుగా ఉండిపోతుంది. వాపు ఏర్పడి నొప్పి వస్తుంది. వాస్తవానికి శరీరంపై గాయం కారణంగా చర్మం కింద ఉండే చిన్న చిన్న రక్త కణాలు దెబ్బతిన్నప్పుడు చుట్టు పక్కల ఉన్న కణజాలం నుంచి రక్తం కారడం వలన చర్మంపై నీలి రంగు మచ్చ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ గాయాలు చాలా వారాల పాటు ఉంటాయి.

పురుషుల కంటే స్త్రీలకు రక్తనాళాలు బలహీనంగా ఉంటాయి. అందుకే చిన్నపాటి గాయాల వల్ల మహిళలకు శరీరంపై ఎక్కువ గాయాలు అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ మచ్చల నివారణ కోసం నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వాటిని పాటించడం ద్వారా ఇలాంటి అంతర్గత గాయాలను త్వరగా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మచ్చలను కూడా తగ్గించుకోవచ్చు.

📌 వంటగదిలో మనం నిత్యం వినియోగించే పసుపు గాయాల వల్ల ఏర్పడే నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరినూనెను వేడి చేసి, కొద్దిగా పసుపు వేసి, చల్లారాక, పేస్ట్ లాగా దెబ్బలున్న చోట రాయాలి. దీంతో గాయం చాలా త్వరగా మానుతుంది.

📌 ఆముదం కూడా గాయాలతో పాటు నొప్పి, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చర్మానికి అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. గాయాలపై ఆముదం నూనెను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం ద్వారా.. గాయం వెంటనే నయం అవుతుంది. మచ్చ కూడా మాయమవుతుంది.

📌 అలోవెరా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే.. చర్మంపై గాయాల వల్ల కలిగే నొప్పి, వాపును కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ప్రభావిత ప్రాంతంలో ప్రతిరోజూ దీన్ని పూయడం వల్ల గాయం గుర్తు నయం అవుతుంది.

Also Read:

అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ముఖేష్ అంబానీకి మరో మెయిల్.. ఈసారి రూ. 200 కోట్లు డిమాండ్..

#bruises #rid-of-bruises-on-body
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe