Tiger fish: మొసళ్లను కూడా వేటాడు గలదు..ఈ టైగర్ ఫిష్!

టైగర్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన చేప గా పేరుగాంచింది. దీని దంతాలు చాలా పదునుగా ఉంటాయి. అంతేకాకుండా భయంకరమైన మొసళ్లను వేటాడేందుకు కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి

New Update
Tiger fish: మొసళ్లను కూడా వేటాడు గలదు..ఈ టైగర్ ఫిష్!

ప్రమాదకరమైన చేపల జాబితాలో మొదటి స్థానం పఫర్ చేపకు దక్కుతుంది.. ఇది అత్యంత విషపూరితమైనది. దీన్ని తినడం వల్ల మరణానికి కూడా దారి తీయవచ్చు. అయితే ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన చేపల గురించి చెప్పబోతున్నాం. వీటి దంతాలు బాకులు లాంటివి అంతేకాకుండా భయంకరమైన మొసళ్లను వేటాడగలవని పేరుగాంచినవి. ఇవి ఎంత ప్రమాదకరం అంటే కేవలం 30 సెకన్లలో మొసళ్ల ఎముకలు కూడా నమిలేంత హింసాత్మక మైనవి.వీటిని దెయ్యం చేపలు అని కూడా అంటారు.

ఈ చేప పేరు టైగర్ ఫిష్. ఇది ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన చేపగా పరిగణించబడుతుంది.  ఈ టైగర్ ఫిష్ దంతాలు పులిలాగా క్రూరంగా కనిపిస్తాయి.ఆఫ్రికాలోని మంచినీటిలో కనిపించే ఈ చేప మనుషులను కూడా వేటాడుతుంది.అలాగే మానవులను వేటాడడమే కాదు మొసళ్ల వంటి బరువైన  ప్రమాదకరమైన జంతువులను కూడా క్షణికావేశంలో తినగలదు. ఈ శక్తివంతమైన చేప దాని చుట్టూ ఉన్న మాంసాన్ని వాసన చూసి పసిగట్టగలదు. ఇది మాంసం మరియు ఎముకలను సులభంగా తినగలదు. అందుకే ఇది ఎవరికీ భయపడదు. దీనిని హైడ్రోసైనస్ గోలియత్ అని ఆఫ్రికాలో పిలుస్తారు.

గోలియత్ టైగర్ ఫిష్ దాని కుటుంబానికి చెందిన అతిపెద్ద చేప. ఇది 49 కిలోల వరకు ఉంటుంది. కాంగో, లువాలాబా కాకుండా, ఇది ఆఫ్రికాలోని అన్ని సరస్సులలో కనిపిస్తుంది. ఇవి మంచినీటిలో నివసించడానికి ఇష్టపడతాయి. దీని చర్మం వెనుక భాగంలో ఆలివ్ , లోపల వెండి రంగులో ఉంటుంది. ఇది దాని భారీ పరిమాణం  బరువుతో ఎరను భయపెడుతుంది. దాని దంతాలు రేజర్ లాగా పూర్తిగా పదునుగా ఉంటాయి. ఇవి10 నుండి 15 సంవత్సరాల వరకు సులభంగా జీవించి ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు