Thummala Nageswara: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా?

కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్‌లు పడ్డాయి. జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని తుమ్మలకు జ్యోతిష్య పండితులు సూచించారట. జ్యోతిష్యాన్ని తప్పక పాటించే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తుంది. తుమ్మల మనవిని మన్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 17వ తేదికి తన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం.

New Update
Thummala Nageswara: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా?

Thummala Nageswara Rao Break to Join in Congress party: తెలంగాణలో ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు రోజుకో రకంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కాంగ్రెస్(Congress) లోకి వెళ్లడం ఖరారయింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు బ్రేకులు పడ్డాయి. జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచించారట. జ్యోతిష్యాన్ని తప్పక పాటించే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరినట్లు తెలుస్తుంది. తుమ్మల మనవిని మన్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 17వ తేదికి తన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం.

పాలేరు వ్యవహారం తేలుతుందా..?

రాహుల్(Rahul) యూరప్(Europe) పర్యటన ముగించుకుని భారత్(India) కు వచ్చిన అనంతరం తెలంగాణలో రెండు రోజులపాటు సీడబ్ల్యూసీ(CWC) సమావేశం కానుంది. ఈ క్రమంలోనే పదిహేడో తేదీన తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహణకు టీపీసీసీ(TPCC) సన్నాహాలు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సహా పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమంకు హాజరుకానున్నారు. అదే రోజున తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆలోపు వైఎస్ షర్మిల(YS Sharmila) వ్యవహారం, పాలేరు అభ్యర్థిత్వం, వామపక్షాలతో పొత్తు అంశంపై స్పష్టత వస్తుందనే భావనలో ఉన్నారు తుమ్మల. బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థిత్వం దక్కకపోవడంతో అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC President Revanth Reddy)తో పాటు మరికొందరు నేతలు నేరుగా కలిసి కాంగ్రెస్‏లోకి రావాలని ఆహ్వానించడంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

Also Read: బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చంద్రవతి?

కాంగ్రెస్.. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తుందా..?

అయితే ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో అవమానం జరిగిందని, ఎన్నికల తర్వాత మళ్లీ వాడుకుని వదిలేస్తారని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. దాంతో ‘మీ మాటే నామాట’ అని చెప్పిన తుమ్మల తాను పాలేరులో పోటీచేస్తానని, ప్రతీ ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. కానీ ఈ విషయంపై తుమ్మల ఎక్కడా బహిరంగంగా స్పష్టతనివ్వలేదు. బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ నామ నాగేశ్వరరావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్(Hyderabad)లో ఆయన్ను కలిసి చర్చించినా ఆయన మెత్తబడలేదు. తనకు పాలేరు టికెట్‌ ముఖ్యమని, వేరే పదవులు అవసరంలేదని చెప్పారు. అక్కడి ప్రజలకు తానిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే పాలేరులో ఎమ్మెల్యేగా పోటీచేయాలనేది తన లక్ష్యమని చాలా సార్లు స్పష్టంచేశారు.

Also Read: ‘ఇండియా’ పేరును రాజ్యాంగం నుంచి తొలగింపు..? బీజేపీ ఏం చేయబోతోంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు