Canada: కెనడాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు భారతీయులు దుర్మరణం..!!

కెనడాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఛండీగఢ్ కు చెందిన రీతిక్ ఛబ్రా, తన సోదరుడు రోహన్, పుణెకు చెందిన గౌరవ్ మరణించారు. కారు అదుపుతప్పి రోడ్డు పక్క ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
Canada: కెనడాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు భారతీయులు దుర్మరణం..!!

Canada:  కెనడాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు దుర్మరణం చెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకరారం..ఛండీగఢ్ కు చెందిన రీతిక్ ఛబ్రా, తన సోదరుడు రోహన్, పుణెకు చెందిన గౌరవ్ మరణించారు. వీరు ముగ్గురు కూడా ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. వీరికి సెనెకా కాలేజీలో పుణెక్ చెందిన గౌరవ్ తో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు కూడా ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

కాగా రీతిక్ పుట్టినరోజు వేడుక జరిపేందుకు వెళ్లిన వీరు రాత్రి ఆలస్యంగా తమ కారులో తిరిగి వస్తుండగా కారు అతివేగంతో అదుపుతప్పి పక్కన ఉన్న ఓ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘనటలో ముగ్గురూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే వేరే కారుతో పోటీ పడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి : ‘ రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ’’ నినాదంతో ముందుకెళ్లాం..17వ లోకసభ చివరి సమావేశంలో ప్రధాని మోదీ..!!

కాగా ఈ ముగ్గురు కూడా బ్యూటీ సెలూన్‌లో పనిచేసేవారని, ముగ్గురి మృతి పట్ల సెలూన్ యజమాని సంతాపం వ్యక్తం చేశారు. తాను వారానికి 40 గంటల పాటు ముగ్గురితో కలిసి పని చేసేవాడినని, ముగ్గురు అబ్బాయిలు తన కుటుంబ సభ్యులలాంటి వారని సెలూన్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి :  ఓటీటీలోకి వచ్చేస్తున్న నా సామిరంగ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Advertisment
తాజా కథనాలు