మన బంగారం మంచిదైతే గోడ్డ్ స్మిత్ తో గొడవెందుకని..! ఏపీలో మందు బాబుల కష్టాలను లిక్కర్ ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. పాత బ్రాండ్ లు మర్చిపోలేక ఏపీ బ్రాండ్ లు తాగలేక ఆంధ్ర మందు అష్టకష్టాలు పడుతున్నారనే విషయం తెలిసిందే! ఈ డిమాండ్ తో గోవానుంచి గుట్టు చప్పుడు కాకుండా ఏపీకి సప్లైచేస్తున్నారు ముగ్గురు లిక్కర్ మొనగాళ్లు.
గత కొంతకాలంగా గోవా టూ శ్రీకాకుళం వయా విశాఖపట్నం యదేచ్ఛగా లిక్కర్ రవాణా సాగుతోందని పోలీసుల సమాచారం. దీనికోసం ఓ ముగ్గురు ముఠాకట్టారు. విజయనగరం జిల్లాకు చెందిన పోద్దిలాపూర్ సత్యనారాయణ, ధనుంజయ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొర్ల లక్ష్మణ్.
కొంత కాలంగా కలిసిమెలిసి గోవా నుంచి మూడో కంటికి తెలియకుండా తరలించి..రెండు చేతుల సంపాదిస్తున్నారు.విశాఖ స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో నిఘాతో ఎట్టకేలకు చిక్కారీ ముగ్గురు లిక్కరు మొనగాళ్లు.
తొలుత గోవా లిక్కర్ దందాకు విజయనగరం జిల్లాకు చెందిన సత్యనారాయణ శ్రీకారం చుట్టాడు. నెలకు రెండు మూడు సార్లు గోవా పోతు అక్కడ నుంచి తీసుకొచ్చి అమ్మడం మొదలెట్టాడు.
ఖర్చులు పోనూ లిక్కర్ లాభాలతో నారాయణ నిక్కర్ నిండిపోతుండేది. ఇదేదో బావుందనుకున్నాడు.గోవా లిక్కరంటే మామూలుగా ఉంటుందా..! డిమాండ్ దండిగా ఉండేది. చూస్తుండగానీ సెలబ్రిటీగా మారిపోయాడు. నారాయణకు తోడుగా మరోఇద్దరు తయారయ్యారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొర్రెల లక్ష్మణ్, విజయనగరానికి చెందిన ధనుంజయ్ లిక్కరమ్మ కలిపింది ముగ్గురినీ అన్నట్టుగా టీమ్ ఫామ్ అయ్యారు. ఇక ముందు వెనకా ఆలోచించకుండా.. ఎంచక్కా బిజినెస్ కానిస్తున్నారు.
ముద్రంలో వేటకు వెళ్లినట్టుగా సత్యనారాయణ గోవా వెళ్లి..లిక్కర్ ను కొనుగోలు చేసి తన సహచరులకు సప్లై చేస్తాడు. వాళ్లు లోకల్ గా ఆర్డర్లు తీసుకుని రెడీగా ఉంటారు. సత్యాన్నారాయణ వచ్చాకా అడిగినన్ని బాటిల్స్ అందజేస్తారు.
సత్యనారాయణ సరుకుతో గోవాలో వాస్కోడిగామా ట్రైన్ ఎక్కుతాడు విశాఖపట్నంలో దిగుతాడు. ఆ తర్వాత వాటిని తన కోలిక్కర్ గ్యాంగ్ తో కలిసి..వేర్వేరు రూట్లలో బస్సుల్లో తరలించేస్తున్నారు.
అక్కడ నుంచి ఇక్కడికి తెస్తున్నారంటే అదేదో ఫారన్ సరుకు అనుకునేరు.! అది ఏపీలో అమ్మేదానికన్నా ఛీప్ లిక్కరు..అయితేనేం గోవానుంచి ట్రైన్ లో వస్తుంది.ఆ మాత్రం క్రేజ్ ఉండదా ఏంటి.? చీప్ గా గోవాలో దొరికే మద్యాన్ని ఏపీలో క్రేజీగా అమ్మెస్తున్నారు నారయాణ అండ్ టీమ్.
ఇది అక్కడ నుంచి బాక్సులకు బాక్సులకు గుట్టుచప్పుడు కాకుండా వాస్కోడీగామా బండి దిగుతుంది. మన లిక్కర్ సత్యనారాయణ అక్కడ ఒక్కో బాటిల్ రూ .26 కొనుగోలు చేస్తాడు దాన్ని తన విజయనగరం మిత్రుడు ధనుంజయకు 92 రూపాయలకు అమ్ముతాడు. అంటే ఒక్కో బాటిల్ పై 66 రూపాయల లాభం అన్నమాట సత్తిబాబు.
ఇక మన మారుబేరం ధనుంజయ్ ఎంతకు అమ్ముతాడో చూద్దాం. రూ.92 కొన్న ధనుంజయుడు ఒక్కో బాటిల్ ను వంద రూపాయలకు శ్రీకాకుళానికి చెందిన లిక్కర్ లక్ష్మణ్ కు అమ్ముతాడు. లక్ష్మన్న ఆ బాటిల్ ని ఊళ్లో సీమ సరుకని చెప్పి ఒక్కొక్క క్వార్టర్ని రూ. 120 చొప్పున అమ్ముతున్నాడు.
అంటే గోవాలో రూ. 26 కొన్న క్వార్టర్ సీసా మన ఊరి మందుబాబుకు అందేప్పటికి రూ.120 అవుతోంది.అంటే రూ.94 పెరుగోందన్న మాట. ఇది గవర్నమెంట్ ట్యాక్స్ కన్నా మనోళ్లు వేసే ట్యాక్స్ ఎక్కువగా ఉంది కదా.!
ఇలా వందల బాటిల్ల గోవా నుంచి తెచ్చి హద్దు అదుపు లేకుండా అమ్మేస్తున్నారు మనోళ్లు..! కిక్కు మాట ఎలా ఉన్నా.. గోవా బ్రాండ్ పెట్టి సొమ్ము చేసుకుంటుంది ఈ ముఠా. మందుబాబులు కూడా.. ఇదేదో కొత్త రకం బ్రాండ్ లాగుందని ముచ్చట పడికొంటున్నారు.
మధ్యలో ఉన్న కిక్కు కంటే..గోవా నుంచి తెచ్చిన లిక్కర్ ను తాగడమే కాదు..నలుగురికి ఆ విషయం చెప్పి తాగిస్తున్నారట. దీంతో ఆ లిక్కర్ ఆ పరిసర ప్రాంతాల్లో పర్మినెంట్ బ్రాండ్ అయిపోయింది. ఆ మేరకు డిమాండ్ పెరిగిపోయింది.
అక్రమంగా గోవా మద్యాన్ని తెచ్చి ఏపీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది ఈ ముఠా. వాహనాల తనిఖీల్లో ముఠాబండారం బయటపడింది. రైల్వే స్టేషన్ ఎదుట.. సత్యనారాయణ.. అతను సహచరులు అనుమానాస్పదంగా ఉన్నారు.
తీసుకొచ్చిన సరుకును ఒకరికొకరు మార్చుకుంటున్నారు. విషయాన్ని గుర్తించిన ఎస్ ఈ బి అధికారి శ్రీనాథుడు నేతృత్వంలో అధికారులు.. దాడులు చేశారు. ముగ్గురిని లాక్ చేసి వెరిఫై చేశారు.
దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 294 గోవా లిక్కర్ బాటిల్ ళ్లు గుర్తించారు. వాటిని సీజ్ చేసి ముగ్గురిని స్టేషన్ కు తరలించారు. ఎస్ ఈ బి డిప్యూటీ కమిషనర్ బాబ్జి రావు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. కూపి లాగారు.
దీంతో మందు దందా బయటపడింది. డిప్యూటీ కమిషనర్ బాబ్జి రావు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ప్రకటనలో తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరచూ వస్తున్న ప్రయాణికుల పై నిఘా పెంచారు.