NTR Birth Anniversary : మద్యపాన నిషేధం(Prohibition Of Alcohol).. ఈ పదం ఎక్కడ వినపడినా తెలుగువారికి ముందుగా ఎన్టీఆరే (NTR) గుర్తొస్తారు..! ఈ ఎన్నికల హామీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నవారూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మద్యపాన నిషేధం వెనుక ఉన్న కథ గురించి కొందరికే తెలుసు.. ఇంతకీ ఏంటా కథ? ఎన్టీఆర్ మద్యపాన నిషేధం సక్సెస్ అయ్యిందా? ఇప్పుడు తెలుసుకుందాం!
తనదైన ముద్ర..
నందమూరి తారక రామారావు మే 28, 1923న కృష్ణా జిల్లా (Krishna District) లోని ని`మ్మకూరులో జన్మించారు. 1949లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేశారు. ఎన్నో పాత్రలతో మెప్పించారు. సినిమాల్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీలోనూ సక్సెస్ అయ్యారు. 1983 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయన స్థాపించిన పార్టీ టీడీపీ (TDP) విజయడంఖా మోగించింది. సీఎంగా ఎన్నికైన ఎన్టీఆర్ 1989 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించలేకపోయారు.
Also Read : నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. ఎన్టీఆర్ లాంటివారు!
సారా వ్యతిరేక ఉద్యమం..
ఇదే సమయంలో రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం ఉదృతమయ్యింది. దూబగుంట రోశమ్మ నాయకత్వంలో ఆనాడు మహిళలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ఈ పోరాటం పేద, గ్రామీణ స్త్రీల నుంచి మధ్యతరగతి, పట్టణ స్త్రీల వరకు మద్దతు లభించింది. గాంధీజీ సిద్ధాంతాలను, ఆదర్శాలను అనుసరించే పురుషులు కూడ సంపూర్ణ మద్యనిషేధానికి మద్దతు తెలిపారు. రాజకీయ శక్తి పునాదులను వణికించేలాగా స్త్రీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ గ్రామాల నుంచి పోరాటాలను చేశారు.
ఎన్టీఆర్ తొలి సంతకం..
రోశమ్మ స్పూర్తితో కదిలిన ఆనాటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే 'సంపూర్ణ మద్యపాన నిషేధం' అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన మాట మీద నమ్మకంతో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఎన్టీఆర్ తొలి సంతకం చేశారు. అయితే అక్రమ మద్యం, నాటుసారా కారణంగా నిషేధం అమలు చేయలేకపోతున్నామని 1997లో నాటి సీఎం చంద్రబాబునాయుడు ఈ నిషేధాన్ని ఎత్తేశారు.