పశువుల్లో ఈ వ్యాధి పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.. పాడి రైతులూ జాగ్రత్త పడండి..!

రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేస్తున్నారు.అయితే గుజరాత్ లో ఎక్కువగా ఖరవ మొవాస వ్యాధి పశువులలో వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి పాల ఉత్పత్తిని భారీగా తగ్గిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు వెంటనే గుర్తించి వైద్యులు చికిత్స అందించాలంటున్నారు . అసలు ఈ వ్యాధి ఎంటో చూద్దాం!

New Update
పశువుల్లో ఈ వ్యాధి పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.. పాడి రైతులూ జాగ్రత్త పడండి..!

రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ఎక్కువ చేస్తుంటారు. పెద్ద సంఖ్యలో పశువులను కొనుగోలు చేసి.. నిత్యం పాలు తీస్తూ ఉపాధి పొందుతుంటారు. అయితే మారుతున్న వాతావరణం కారణంగా పశువుల్లో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాయి.గుజరాత్ లో ఖర్వా మొవాసా వ్యాధి పశువులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో అధికంగా కనిపిస్తుంది. ఇది ఇతర ప్రాంతాలకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. పశువులలో ఎప్టో వైరస్ వల్ల కలిగే వ్యాధి జంతువుల పనితీరు, పాల ఉత్పత్తి మరియు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి సామర్థ్యం భారీగా పడిపోతోంది.

ఈ వ్యాధి తీవ్రమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ వ్యాధితో బాధపడే జంతువులకు సాధారణంగా అధిక జ్వరం (103-105 0 F).. నోటి నుండి నురగ వస్తుంటుంది. ముఖ్యంగా జంతువుల నాలుక, గొంతు, నోరు వాచిపోతాయి.అంతేకాదు ఈ వ్యాధి వచ్చిన పశువులు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాయంట. కుంటుతూ నడుస్తాయని వైద్యులు చెపుతున్నారు. ఇది అంటు వ్యాధి కావడంతో వేగంగా వ్యాపిస్తోందని చెపుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుడిని పిలిపించి సరైన చికిత్స అందించాలి. తద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు అంటున్నారు. అంతేకాదు అనారోగ్యంతో బాధపడుతున్న పశువును.. వేరేగా ఉంచాలని సూచిస్తున్నారు. 1 శాతం పొటాషియం పారామాగ్నెట్‌తో వ్యాధితో బాధపడుతున్న పశువులకు ఇవ్వడం ద్వారా దీనిని తగ్గించ వచ్చు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు