Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే

రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం ఈ అలవాట్లు తప్పనిసరిగా పాటించాలి. త్వరగా నిద్ర లేవడం, ఉదయం యోగ, హెల్తీ బ్రేక్ ఫాస్ట్, మెడిటేషన్, సరైన నీళ్లు తాగడం, వ్యాయామం వంటివి చేయాలి. ఇలా చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఉత్తేజపరుస్తుంది.

New Update
Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే

Early Wake-Up : శారీరక, మానసిక ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాల పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ రోజూ ఉదయం(Daily Morning) మనం పాటించే అలవాట్లు రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచడానికి సహయ పడతాయి. రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే ఈ అలవాట్లను పాటించండి.

ఉదయం త్వరగా నిద్ర లేవాలి

చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవడానికి బద్దకం(Lazy) చూపిస్తారు. కానీ త్వరగా నిద్ర లేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. రోజంతా చురుకుగా ఉండడంతో పాటు ఏకాగ్రత కూడా రెట్టిపు అవుతుంది. అలాగే పనులు చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం లభిస్తుంది.

మెడిటేషన్ చేయడం

ఉదయం లేవగానే రోజూ పనులు చేయడానికి ముందు కొంత సమయం మెడిటేషన్(Meditation) కు కేటాయించాలి. ధ్యానం చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

శారీరక శ్రమ

ప్రతీ రోజు ఉదయాన్నే శారీరక శ్రమ.. జాగింగ్ , వాకింగ్(Walking), వ్యాయామం వంటివి చేయాలి. ఇవి శారీరకంగా దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో శక్తిని కూడా పెంచుతాయి.

నీళ్లు బాగా తాగాలి

ఉదయం నిద్ర లేవగానే ఎంప్టీ స్టమక్ నీళ్లు బాగా తాగాలి. ఇది శరీర నిర్విషీకరణకు(Detoxification) ఉపయోగపడుతుంది. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మెటబాలిజం వేగంగా పని చేయాలంటే నీళ్లు బాగా తీసుకోవాలి.

publive-image

Also Read: Palmyra Sprout: తాటి తేగలు తింటే.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!

ఫోన్స్ చూడకూడదు

కొంత మంది నిద్ర లేవగానే ఫోన్స్(Phones) ముందు పెట్టుకుంటారు. ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం చాలా ప్రభావం ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి సమస్యలు పెరిగే ఆవకాశం ఉంటుంది. అంతే కాదు రోజంతా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్

ఉదయాన్నే మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్(Breakfast) పై మన డే ఆధారపడి ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే.. రోజంతా నీరసంగా అనిపిస్తుంది. అలాగే ఏ పని శ్రద్ధ చూపలేకపోతారు. అందుకే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం తప్పనిసరి.

బుక్స్ చదవడం

ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ లేదా ఏదైనా బుక్ చదవడం మంచి అలవాటు ఇలా చేస్తే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే ఏదైనా మానసిక సమస్యల నుంచి డైవర్ట్ అవ్వడానికి సహాపడుతుంది.

Also Read: Sleeping Tips: మంచి నిద్ర కోసం సింపుల్ టిప్స్.. ఇవి పాటిస్తే హ్యాపీగా నిద్రపోతారు!

Advertisment
తాజా కథనాలు