దీపావళి పండుగ వచ్చేస్తోంది. కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కారు అంటేనే ఖరీదైనది. కారు కొనాలని అనుకున్నపుడు మన బడ్జెట్ కు అనుగుణంగా ఉండే కారును ఎంచుకుంటాం. లగ్జరీ కారు కొనుక్కోగలిగితే దానిలో చాలా అధునాతన గ్యాడ్జెట్స్(Car Gadgets) ఉంటాయి. కానీ అంత ఖరీదు పెట్టలేని పరిస్థితిలో బేస్ మోడల్ కారు కొనుక్కోవడం చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో కొన్ని గ్యాడ్జెట్స్ కారు కోసం తీసుకోవడం ద్వారా మీరు మీ కారులో లగ్జరీ సౌకర్యాలను పొందే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి ఖర్చుతో వీటిని మీ కారులో అమర్చుకోవచ్చు. అటువంటి ఉపయోగపడే కొన్ని గ్యాడ్జెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- కారు సేఫ్టీ కోసం ఉపయోగపడే గ్యాడ్జెట్స్:
- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్: Car Gadgets: టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) నాబ్‌లు- కొన్ని పరికరాలను కలిగి ఉంటుంది. వీల్ వాల్వ్‌లపై సెన్సార్ అమర్చిన చిన్న బుడిపె వంటి పరికరాలను అమర్చడం ద్వారా ఇది పని చేస్తుంది. ఈ నాబ్ వీల్ వాల్వ్‌లపై అమర్చిన సెన్సార్ బుడిపెల సహాయంతో నాలుగు టైర్ల గాలి పీడనాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ పరికరాన్ని కారు డాష్‌బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేయవచ్చు, ఇది సౌరశక్తితో ఛార్జ్ అవుతుంది. దీని ఖరీదు సుమారు రూ.1,000ల నుంచి ప్రారంభం అవుతుంది.
- బ్లైండ్ స్పాట్ మిర్రర్: Car Gadgets: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, మీ కారును వెనుక నుంచి మరొక వాహనం ఓవర్‌టేక్ చేసినప్పుడు, ఆ వాహనం చక్కగా కనిపించేలా ORVMలో కుంభాకార అద్దాలు అమర్చుకోవచ్చు. ఇది వైడ్ యాంగిల్ వ్యూను అందిస్తుంది. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు తగ్గుతాయి. దీని ఖరీదు సుమారు రూ.200ల నుంచి ప్రారంభం అవుతుంది.
- రివర్స్ పార్కింగ్ కెమెరా: Car Gadgets: మీరు మీ కారులో రివర్స్ పార్కింగ్ కెమెరాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని సహాయంతో కారును పార్కింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. దీనితో, మీరు ముందు- వెనుక పార్కింగ్ సెన్సార్లను కనెక్ట్ చేయడం ద్వారా కారును సౌకర్యవంతంగా పార్క్ చేయవచ్చు. దీని ఖరీదు సుమారు రూ.600ల నుంచి ప్రారంభం అవుతుంది.
- సెంట్రల్ లాకింగ్ సిస్టమ్: Car Gadgets: సెంట్రల్ లాకింగ్ సదుపాయం చాలా మోడళ్లలో అందుబాటులో ఉంది. అయితే ఈ సదుపాయం మీ కారులో అందుబాటులో లేకుంటే, మీరు ఈ లాకింగ్ సిస్టమ్‌ను కంపెనీ నుంచి లేదా బయటి ఆటోమొబైల్ షోరూమ్స్ వద్ద కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, కారు అన్ని డోర్స్ ఒకేసారి లాక్ అలాగే అన్‌లాక్ చేసే అవకాశము ఉంటుంది. దీని ఖరీదు సుమారు రూ.3200ల నుంచి ప్రారంభం అవుతుంది.
- వైర్‌లెస్ డోర్ వార్నింగ్ లైట్: Car Gadgets: మనం రాత్రిపూట కారు డోర్ తెరిచినప్పుడు చాలాసార్లు కారు వెనుక వచ్చే వారికి కనిపించదు. అటువంటి పరిస్థితిలో, వైర్లెస్ డోర్ వార్నింగ్ లైట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ లైట్లలో బ్యాటరీలు అమర్చి ఉంటాయి. కారు తలుపు తెరిచినప్పుడు ఆటోమేటిక్‌గా లైట్ ఆన్ అవుతుంది. ఇది సుమారు రూ.500ల నుంచి అందుబాటులో ఉంటుంది.
Also Read: Stock Market: లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. గత వారం మార్కెట్ ఇలా..
- కారును లగ్జరీగా మార్చే గాడ్జెట్లు..
- ఎయిర్ ప్యూరిఫైయర్: Car Gadgets: భారతదేశంలోని కాలుష్యం కారణంగా, చాలా మంది ప్రజలు తమ కార్లను నాలుగు కిటికీలు మూసేసి నడుపుతారు. అయితే కారు కిటికీలను నిరంతరం మూసి ఉంచడం కూడా హానికరం. అటువంటి పరిస్థితిలో, మీరు మీ కారులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దీని ఖరీదు సుమారు రూ. 2600ల నుంచి ప్రారంభం అవుతుంది.
- డాష్‌క్యామ్: Car Gadgets: చాలాసార్లు, ప్రమాదం జరిగినప్పుడు, అది మీ తప్పు కాకపోయినా, మీరు దానిని వివరించి చెప్పే పరిస్థితి ఉండదు. అవతలి వారు మీదే తప్పు అని క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మీకు డాష్ క్యామ్ ఉపయోగపడుతుంది. దీనిని డాష్ బోర్డు లో అమర్చడం ద్వారా ఇది కారు నడుస్తున్నప్పుడు వీడియోను రికార్డ్ చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.2000ల నుంచి ప్రారంభం అవుతుంది.
- లేజర్ స్టాప్ లాంప్: Car Gadgets: మనం కారు బ్రేక్ వేసినపుడు వెనుక వున్న వాహనం మన కారుకి ఎంత దూరంలో ఆగాలో సూచిస్తుంది లేజర్ స్టాప్ లాంప్. శీతాకాలం, వర్షం కురిసే సమయంలో, అలాగే మంచుతో వాతావరణం ఉన్న సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది సుమారు రూ.250ల నుంచి దొరుకుతుంది.
- OBD స్కానర్: Car Gadgets: ఇది కారు స్టీరింగ్ వీల్ క్రింద కనిపిస్తుంది. ఇది బ్లూటూత్ ద్వారా మొబైల్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ పరికరం కారు ఇంజిన్ - ట్రాన్స్‌మిషన్‌లో లేదా ABS, EBD వంటి భద్రతా ఫీచర్లలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించి తెలియజేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.4000ల నుంచి ప్రారంభం అవుతుంది.
Please watch this Interesting Video: